Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బిగ్ బాస్ కు ఆ రెండే అడ్డంకులు

బిగ్ బాస్ కు ఆ రెండే అడ్డంకులు

బిగ్ బాస్ సీజన్ 3కి ఇప్పటి వరకు సరైన పోటీదారులు దొరకడం లేదు. ఎంతోమందిని ట్రయ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఫైనల్ అయినవారు లేరు. రెండో సీజన్ కు సరైన పేరు రాలేదు. కానీ వివాదాలు మాత్రం ఎక్కువ. ఇప్పుడు మూడో సీజన్ కు కాస్త పేరున్న సెలబ్రిటీలను తీసుకుందాం అంటే అనేక అడ్డంకులు వస్తున్నాయి.

సినిమా జనాలకు 100రోజులు వేరే పని మీద వుండిపోవడం అంటే వీలు అయ్యేదికాదు. బయట షూటింగ్ లు కేవలం బిగ్ బాస్ కోసం వదులుకుంటే కెరీర్ పరంగా అంత మంచిది కాదు. పైగా వందరోజుల పాటు ఫోన్ కు దూరంగా వుండడం అన్నది కూడా సమస్యే.

మొబైల్ అడిక్షన్ భయంకరంగా వున్న ఈ కాలంలో ఫోన్ లేకుండా వందరోజులు వుండడం అంత చిన్న విషయం కాదు. అప్పటికీ నిర్వాహకులు లోపాయికారీగా రోజుకు ఓసారి ఒకటి రెండు ఫోన్ లు చేసుకునే అవకాశం ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఇంట్లో వారితో టచ్ లో వుండొచ్చు. కానీ సెలబ్రిటీలు, చిన్న అయినా, పెద్ద అయినా, బయట వ్యవహారాలు ఒకటీ రెండూ కావు. అందుకే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

సరైన అవకాశాలు లేనిచోటా మోటా నటులు, యాంకర్లు, సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నవాళ్లు మాత్రమే వడపోతలో మిగులుతున్నారు. కేవలం వారిని పెట్టుకుని, నాగార్జున లాంటి పెద్ద హీరో ను హోస్ట్ గా తీసకుని ఏం చేసుకోవాలి. అవతలి వాళ్ల రెస్పాన్స్, బ్యాక్ గ్రవుండ్ ఇవన్నీ బాగుంటే హోస్ట్ బాగా చేయడానికి వీలవుతుంది. లేదంటే చప్పగా వుంటుంది.

బిగ్ బాస్ టీమ్ ఎంతమందిని అప్రోచ్ అవుతున్నా, ఎక్కువ మంది నో చెప్పడానికి కారణం 100 రోజులు కావడం, అలాగే మొబైల్ వదిలేయాల్సి రావడం కీలకంగా కనిపిస్తున్నాయి. దానికితోడు ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు వగైరా తలనొప్పులు వుంటాయి. అందుకే బిగ్ బాస్ 3 కి సరైన కంటెస్టెంట్ లు దొరకడం అంత వీజీ కాదు.

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?