బిగ్ బాస్ కు అడ్డం పడిన రాజమౌళి

స్టార్ మా బిగ్ బాస్ షో ట్రబుల్ లో పడింది. బిగ్ బాస్ షో సెకెండ్ సీజన్ చేస్తాడు అనుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు పక్కకు తప్పకున్నారు. అయినా స్టార్ మా ఆశలు వదులుకోలేదు. ఇంకా…

స్టార్ మా బిగ్ బాస్ షో ట్రబుల్ లో పడింది. బిగ్ బాస్ షో సెకెండ్ సీజన్ చేస్తాడు అనుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు పక్కకు తప్పకున్నారు. అయినా స్టార్ మా ఆశలు వదులుకోలేదు. ఇంకా ట్రయ్ చేస్తోంది. కానీ దీని వెనుక అసలు కారణం దర్శకుడు రాజమౌళి కావడం విశేషం.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెల అంతా తనకు కేటాయించాలని, రాజమౌళి ఇటు రామ్ చరణ్ కు, అటు ఎన్టీఆర్ కు చెప్పేసాడు. ఆగస్టు నెలా అంతా తను వాళ్లతో చేయబోయే యాక్షన్ సీక్వెల్స్ కు సంబంధించిన ప్రీ షూట్ వర్క్ కొంత వుంది, విజువలైజ్ చేసుకోవాలి.

ఆ నెల అంతా తనతో వుండాలని అడిగేసాడు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తానని కూడా చెప్పేసాడు.

దాంతో ఎన్టీఆర్ ఇప్పుడు అర్జెంట్ గా మార్చి 20 తరువాత త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసి, నాలుగు నెలల్లో దాన్ని పూర్తి చేయాల్సి వుంది. ఇక శని, ఆదివారాలు బిగ్ బాస్ అంటే అయ్యేలా కనిపించడం లేదు. అందుకే స్వారీ చెప్పేసాడట.

అయితే ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోమని వాళ్లు అడుగుతున్నారట. కానీ వన్స్ రాజమౌళి సినిమా మీదకు వెళ్తే, వ్యవహారం ఎన్టీఆర్ చేతిలో వుండదు. అందువల్ల తానేమీ చేయలేనని చెప్పేసాడట ఎన్టీఆర్.