బిగ్ బాస్ సీజన్ 2కి ఎన్టీఆర్ 'సారీ..' చెప్పేసాడు. మరి ఎవరు? ఆదుకుంటారు.. స్టార్ మా బిగ్ బాస్ ను? ఎన్టీఆర్ తరువాత మళ్లీ అదే రేంజ్ వుండాల్సిందే. ఆ రేంజ్ యువ టాప్ హీరోలు బన్నీ, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ ఈ నలుగురే. కానీ ప్రభాస్ ఇలాంటి వాటికి కచ్చితంగా దూరంగా వుంటాడు. అందులో కాస్త బిడియంగా మాట్లాడేవారు ఇలాంటి వాటిని స్వీకరించడానికి కాస్త మొహమాటపడతారు. అందువల్లే మహేష్ బాబును కూడా పక్కన పెట్టేయాల్సిందే.
ఇక మిగిలింది బన్నీ, రామ్ చరణ్. ఈ ఇధ్దరిలో చూసుకుంటే బన్నీకే ఈ తరహా కార్యక్రమాలుచేసే ఈజ్ వుంది. కానీ ఇక్కడ ఓ సమస్య కాదు. చాలా వున్నాయి. ఎన్టీఆర్ కాదంటే మా దగ్గరకు వచ్చారా? అని హీరోలు ఫీల్ కావడం అనేది ఓ సమస్య. ఎన్టీఆర్ చేసిన తరువాత మనం చేస్తే, జనం ఎలా రియాక్ట్ అవుతారో అన్నది మరో సమస్య.
కానీ తెగించి బన్నీ చేస్తే కచ్చితంగా మెప్పించగలడు. ఎందుకంటే హీరోయిజాన్ని పక్కన పెట్టి, పార్టిసిపెంట్స్ లెవెల్ కు దిగి, ఒక కొత్త ఒరవడిని ఎన్టీఆర్ సెట్ చేసాడు. అందువల్ల ఎవరయినా అది ఫాలో కావాల్సిందే. అలాంటి ఫార్మాట్ ను బన్నీ తప్ప మరెవరు చేసేవారు లేరు. కానీ బన్నీ ఓకె అంటాడో లేదో తెలియదు.
మరో వారం రోజుల్లో బిగ్ బాస్ విషయమై స్టార్ మా హైరేంజ్ మీట్ జరుగుతుందని బోగట్టా. అప్పుడు మరి వాళ్ల దృష్టిలో ఏ పేరు బయటకు వస్తుందో చూడాలి.