ఓ సినిమా హిట్ అయితే పారితోషికం పెంచడం కామన్. మరి ఓ రియాలిటీ షో హిట్ అయిందని రెమ్యూనరేషన్ పెంచితే ఏమనాలి. తెలుగు బిగ్ బాస్ లో కనిపించిన 'సెలబ్రిటీల' తీరు ఇప్పుడు ఇలానే ఉంది. బిగ్ బాస్ హిట్ అయిందంటూ వీళ్లంతా ఇప్పుడు కొండెక్కి కూర్చున్నారు. చిన్న చిన్న రిబ్బన్ కటింగ్స్, టీవీ కార్యక్రమాలకే లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు.
అర్చన, దీక్షాపంత్, హరితేజ, జ్యోతి.. వీళ్లంతా ఇప్పుడు స్టార్స్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్లలో కొందరు భారీ రేట్లు చెబుతున్నారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పెద్ద ఎమౌంట్లు చెబుతున్నారు. సినిమా ఫీల్డ్ లో ఇవన్నీ కామన్. కానీ చిన్న చిన్న టీవీ కార్యక్రమాలకు కూడా లక్షల్లో డిమాండ్ చేయడం మాత్రం విడ్డూరం.
బిగ్ బాస్ తో తాము స్టార్స్ అయిపోయామని వీళ్లంటున్నారు. కానీ ఆ కార్యక్రమం హిట్ అవ్వడానికి అతిపెద్ద కారణం ఎన్టీఆర్ అనే విషయాన్ని వీళ్లు మరిచిపోయినట్టున్నారు. కేవలం వీకెండ్ టీఆర్పీలతోనే బిగ్ బాస్ క్లిక్ అయిందనే మేటర్ ను వీళ్లంతా గుర్తుంచుకుంటే మంచిది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లో పాల్గొనడానికి అసలైన సెలబ్రిటీలు దొరక్క, మరో ప్రత్యామ్నాయం లేక వీళ్లను పెట్టుకున్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇంకా మంచిది.
మధుప్రియ, కల్పన లాంటి వాళ్లు దీనికి మినహాయింపు కాగా.. అటు ఆదర్శ్, సంపూర్ణేష్ బాబు, ప్రిన్స్ లాంటి మేల్ కంటెస్టంట్స్ మాత్రం పారితోషికం కంటే కాస్త క్రేజ్ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారు. ఈ క్రేజ్ తో మరికొన్ని సినిమా అవకాశాలు వస్తే అదే పదివేలు అని ఫీలవుతున్నారు.