Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బీహార్-ముంబాయి..మధ్యలో సుశాంత్ కేసు

బీహార్-ముంబాయి..మధ్యలో సుశాంత్ కేసు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కలకలం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ కేసును ఏకంగా సిబిఐ కి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు, హత్యే అంటూ సుబ్రహ్మణ్యస్వామి లాంటి పొలిటికల్ లీడర్లు ప్రకటనలు చేసారు. కొన్ని లాజిక్ లు కూడా ప్రకటించారు. మరోపక్కన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి మీద ఫిర్యాదులు, కేసు నమోదులు జరిగాయి. కోట్ల వ్యవహారం ఈ మరణం వెనుక వుందన్న అనుమానాలు బయటకు వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో అసలు ముంబాయి పోలీసులు ఈ విషయంలో కోపరేట్ చేయడం లేదని బీహార్ డిజిపి ప్రకటించడం ఇంకా విశేషం. ముంబాయికి పరిశోధన కోసం తమ రాష్ట్రం నుంచి ఎస్పీ స్థాయి అధికారి వెళ్తే, వివరాలు అందించేది పోయి, క్వారంటైన్ లో వుంచారని ఆయన వెల్లడించారు. పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వాలేదని, అవి ఇచ్చి ముంబాయి పోలీసులు నిజాయతీ నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

గత అయిదేళ్లలో యాభై కోట్ల ట్రాన్సాక్షన్లు సుశాంత్ అక్కౌంట్ లో జరిగాయని, వీటి నిగ్గు తేల్చాలని బీహార్ పోలీసులు అంటున్నారు. అయితే ముంబాయి పోలీసులు మాత్రం రియా చక్రవర్తి అక్కౌంట్ కు నేరుగా సుశాంత్ అక్కౌంట్ నుంచి డబ్బులు వెళ్లలేదంటున్నారు. ప్రస్తుతం సుశాంత్ అక్కౌంట్ లో నాలుగున్నర కోట్లు వున్నాయంటున్నారు.

ఇలా రెండు రాష్ట్రాల పోలీసులు వైరుధ్యమైన ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో, సుబ్రహ్మణ్య స్వామి లాంటి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న దృష్ట్యా సిబిఐ ఈ కేసును విచారిస్తే బెటరేమో?

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?