ఐటీ హబ్ గా వైజాగ్?

ఐటీ సెక్టార్ లో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడగల సత్తా ఒక్క విశాఖపట్నానికే ఉంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ఐటీకి చిరునామాగా ఉండేది. అప్పట్లోనే రెండవ స్థానంలో విశాఖ ఉంటూ వచ్చింది. విశాఖకు…

ఐటీ సెక్టార్ లో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడగల సత్తా ఒక్క విశాఖపట్నానికే ఉంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ఐటీకి చిరునామాగా ఉండేది. అప్పట్లోనే రెండవ స్థానంలో విశాఖ ఉంటూ వచ్చింది. విశాఖకు ఐటీ రంగం వేళ్ళూనుకోవడానికి దివంగత వైఎస్సార్ ముఖ్య కారణం అని చెప్పాలి.

వైఎస్సార్ సీఎం అయ్యాక చాలా ముందు చూపుతో విశాఖ ఐటీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఐటీ హిల్స్ ఆయన హయాంలో రూపుదిద్దుకున్నవే. విశాఖలో ఇప్పటికి వందకు పైగా  ఐటీ సంస్థలు నడుస్తున్నాయి. వీటిలో దాదాపుగా ముప్పయివేల మంది ఉపాధి పొందుతున్నారు.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక నూతన ఐటీ పాలసీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే వంద కోట్ల మేర ఇన్సెంటివ్స్‌ ని కూడా ఐటీ రంగం కోరుతోంది. ఇక ఏపీని నాలుగు జోన్లుగా విభజించడానికి జగన్ సర్కార్ రెడీ అవుతోంది.అందులో భాగంగా ఐటీ హబ్ గా విశాఖను తీర్చిదిద్దాలనుకుంటోంది. అదే కనుక జరిగితే అటు హైదరాబాద్, ఇటు బెంగళూర్, మరో వైపు చెన్నై మహా నగరాలకు దీటుగా విశాఖలో ఐటీ సెక్టార్ నిలిచి గెలుస్తుందని అంటున్నారు.

ఈ మేరకు అద్భుతమైన ఐటీ పాలసీని కూడా జగన్ త్వరలోనే ప్రకటించనున్నారని అంటున్నారు. విశాఖ ఐటీలో మేటీగా మారేందుకు సర్వ హంగులను ప్రభుత్వం సమకూరుస్తోందని  అంటున్నారు. అదే జరిగితే విశాఖ పేరు దేశవ్యాప్తంగా మారు మోగడం ఖాయం.

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే