ఎన్టీఆర్ కు బాబాయ్ బాలయ్యకు మధ్య వున్న అంతరం గురించి అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి కూడా జూనియర్ ను పిలవలేదు.
ఆ సంగతి తెలిసీ మీడియా బయోపిక్ గురించి ఎన్టీఆర్ ను అడిగితే ఎలా వస్తుంది సమాధానం? అందునా ఎన్టీఆర్ చాలా స్మూత్ గా కౌంటర్ వేస్తాడు. అలాగే చెప్పాడు ఐపీఎల్ ప్రెస్ మీట్ లో సమాధానం.
‘ఇంకా పిలుపు రాలేదండీ. వస్తే, అలాగే తప్పకుండా మీకు చెప్పి, ఆ తరువాత ఆలోచిస్తాను’ అన్నాడు ఎన్టీఆర్. పిలుపురాదనీ ఎన్టీఆర్ కు తెలుసు. వచ్చినా చేయడనీ తెలుసు. ఆ విషయం మీడియాకూ తెలుసు. ఏదో అడగడం చెప్పడం అంతే.
అంతకు ముందు కూడా ఇదే మీట్ లో బయోపిక్ ల గురించి అడిగితే, తాను జస్ట్ యాక్టర్ ను అని జాతీయస్థాయి వ్యక్తులను సినిమాల్లో పోట్రేయెట్ చేయాలంటే కాస్త భయమని, అందుకే తను చేయనని క్లియర్ గా చెప్పేసాడు.
ఇప్పటికే మహానటి సినిమాలో ఎన్టీఆర్ గా చేయమంటే, ‘చేయను’ అని నిర్మొహమాటంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చేసాడు ఎన్టీఆర్. అయినా ఇకపై కూడా ఎన్టీఆర్ కనిపించినపుడల్లా ఈ బయోపిక్ ప్రశ్నలు వెన్నాడుతూనే వుంటాయేమో?
అయినా బయోపిక్ లో ఎన్టీఆర్ పోషించదగ్గ క్యారెక్టర్ ఏముంటుంది? మనవడిగా రియల్ క్యారెక్టర్ లో కనిపించాలా? లేక, తండ్రి హరికృష్ణ కింద కనిపించాలా? అసలు క్యారెక్టర్ ఎలాగూ బాబాయ్ బాలయ్యదేగా? అందువల్ల పాత్రాలేదు.. పిలుపూరాదు.