ఎన్టీఆర్ బయోపిక్ హడావుడి మెల్లగా అందుకుంది. ప్రీరిలీజ్ ఫంక్షన్ పూర్తయింది. ప్రచారం మొదలయింది. సినిమా సెన్సారు శనివారం షెడ్యూలు అయింది. ప్రసాద్ ల్యాబ్ లో నిన్నరాత్రే కంటెంట్ అప్ లోడ్ చేసారు. ఈరోజు 12 గంటల ప్రాంతంలో సెన్సారు సభ్యులు సినిమాను చూడబోతున్నారు.
ఇప్పటిదాకా ఆ నోటా ఈ నోటా విన్నమాటలే తప్ప, సినిమా నేరుగా చూసినవారు లేరు. ఇఫ్పడు సెన్సారు సభ్యులు చూస్తే టాక్ బయటకు వస్తుంది. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు మాత్రం పూర్తి కాన్ఫిడెన్స్ తో వున్నారు. రీరికార్డింగ్ పూర్తిచేసిన కీరవాణి సినిమా మీద మాంచి ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే 9వ తేదీ లోపు ఆంధ్రలో మరో ఫంక్షన్ చేసే ఆలోచనలో బయోపిక్ యూనిట్ వున్నట్లు తెలుస్తోంది. టైమ్ కుదిరితే నిమ్మకూరులో ఫంక్షన్ చేయాలని, చంద్రబాబు ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని చూస్తున్నారు.
ఒకవేళ టైమ్ సెట్ కాకపోతే, జనవరి మూడోవారంలో రెండోభాగం ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అక్కడ చేయాలని అనుకుంటున్నారు.