Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బయోపిక్-డ్యామేజ్ కంట్రోల్

బయోపిక్-డ్యామేజ్ కంట్రోల్

పదేళ్ల కల ఇందూరి విష్ణుది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని. ఆ స్క్రిప్ట్ వినగానే ఎగ్జయిట్ అయిపోయి, దీనికి బాలయ్య ఎలా అంటే నేను అలా అని రెడీ అయిపోయారు సాయి కొర్రపాటి. ముంబాయి వెళ్లి విద్యాబాలన్ ను మాట్లాడి తీసుకువచ్చింది విష్ణు. ఇక్కడ సినిమాకు కావాల్సిన వ్యవహారాలు ఏర్పాట్లు చూసింది సాయి కొర్రపాటి. ఇద్దరి ఆశ ఒక్కటే. ఓ మంచి ప్రాజెక్టులో భాగస్వాములుగా వుండాలన్నదే. 

కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆ ఇద్దరు నిర్మాతలు కాదు, కేవలం సమర్పకులు అన్న క్లారిటీ యూనిట్ నుంచి వచ్చేసింది. అదే విషయం గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. కానీ ఇదేదో డ్యామేజ్ అన్నట్లు సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు అన్నీ తనపైన వేసుకున్న బాలయ్య తోడల్లుడు ప్రసాద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఆ ఇద్దరు పైసా పెట్టుబడి పెట్టలేదు. అలాంటపుడు నిర్మాతలు ఎలా అవుతారు? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరి అలాంటపుడు ఇప్పటివరకు ప్రతి ప్రెస్ రిలీజ్ మీద, డిజైన్ ల మీదా వాళ్ల పేర్లు సహనిర్మాతలు అని ఎలా వేసినట్లు? ఇప్పటిదాకా పోనీ పెట్టుబడి పెట్టలేదు అనుకుందాం. ఇప్పడు పెట్టమంటే వాళ్లు రెడీనే కదా? విష్ణు సంగతి తెలియదు కానీ, సాయి కొర్రపాటి అంటే ఎంతకైనా రెడీ అంటారు కదా? 

మరి ఆ రూట్లో వెళ్లకుండా అసలు పెట్టుబడి పెట్టలేదు, నిర్మాతలు కాదు అనడం ఏమిటో? పోనీ అదే సరైనది అనుకున్నా, మరి వారిని సమర్పకులుగా మాత్రం ఎందుకు పెట్టడం? మొత్తంమీద ఒకటి అయితే పక్కా అయింది. ఎన్టీఆర్ బయోపిక్ కు సహనిర్మాతలు ఎవ్వరూ వుండరు. నిర్మాతగా బాలయ్య పేరు మాత్రమే వుంటుంది. అది క్లియర్. ఎందుకు? ఏమిటి? అలా? ఎలా? అన్నది మాత్రం అన్ క్లియర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?