ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ కథానాయకుడు విడుదలైన రెండువారాలకే పార్ట్ 2 కూడా విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు. కానీ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని, పార్ట్ 2ను ఫిబ్రవరికి పంపిస్తారని వార్తలు బయటకు వచ్చాయి. కానీ యూనిట్ మాత్రం సమస్యే లేదని, అనుకున్న ప్రకారం రెండువారాల గ్యాప్ లో రెండోపార్ట్ విడుదలవుతుందని అంటోంది.
అన్నీ ఆలోచించి, డిస్కషన్లు జరిగాకే క్రిష్ కు ఫైనల్ నిర్ణయం వదిలేసారు. ఆయన ఈ విధంగా రెండువారాల గ్యాప్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే మరి ఇప్పుడు ఈ కొత్త గ్యాసిప్ ఎందుకు పుట్టినట్లు? రెండోభాగం మార్కెట్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బయ్యర్లకు అవసరమైతే ఓ వారం వెనక్కు వెళ్తుందని యూనిట్ చెబుతున్నట్లు వినిపిస్తోంది.
మరీ రెండువారాల గ్యాప్ లో అంటే పస్ట్ పార్ట్ రేంజ్ కలెక్షన్లు వుంటాయో వుండవో, అందువల్ల రేట్లు తేడా వస్తాయేమో అన్న డిస్కషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ చూసి, అవసరం అయితే ఓ వారం వెనక్కు వెళ్లే ఆలోచన చేద్దామనే పాయింట్ యూనిట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్లకు వచ్చినట్లు వినిపిస్తోంది.
అందువల్లే పార్ట్ 2 ఫిబ్రవరికి వాయిదా అనే వార్తలు బయటకు వచ్చాయన్నమాట. కానీ డైరక్టర్ క్రిష్ మాత్రం ఇప్పటికీ తనమాట మీదే వున్నారు. సమస్యేలేదు. అనుకున్నట్లే జనవరిలోనే రెండోభాగం కూడా విడుదల అంటున్నారట.
కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్