హీరో నిఖిల్‌.. కడుగుడా.? కెలుకుడా.?

మొన్నామధ్య యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండని ఉద్దేశించి మరో యంగ్‌ హీరో నిఖిల్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి. 'సముద్రంలో నీటి బొట్టంత..' అంటూ నిఖిల్‌ ఆ ట్వీట్‌లో కడిగేశాడు విజయ్‌…

మొన్నామధ్య యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండని ఉద్దేశించి మరో యంగ్‌ హీరో నిఖిల్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి. 'సముద్రంలో నీటి బొట్టంత..' అంటూ నిఖిల్‌ ఆ ట్వీట్‌లో కడిగేశాడు విజయ్‌ దేవరకొండ ఆటిట్యూడ్‌ని. నిఖిల్‌, సినిమాల గురించే కాదు, ఇతరత్రా అంశాల గురించీ సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటాడు.

మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా తితిలీ తుపానుతో అతలాకుతలమైపోతే, వున్నపళంగా అక్కడికి వెళ్ళిపోయి తనవంతుగా 'సాయం' చేసి వచ్చాడు.. బాధితులకు అండగా నిలిచాడు. అంతకుముందు ప్రత్యేక హోదా కోసం నినదించాడు నిఖిల్‌.

ఇక, తాజాగా నిఖిల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఝలక్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ని గౌరవించాల్సిందేనంటూ, ఒకవేళ ఆయన జీవించి వుంటే తన విగ్రహం కోసం చేసే ఖర్చుని ఆమోదిస్తారా.? అని నిలదీశాడు. ఒకటి కాదు, రెండుకాదు, పదికాదు.. పాతికా కాదు.. వంద కాదు, రెండొందలూ కాదు.. ఏకంగా 3 వేలకోట్ల రూపాయల్ని ఈ విగ్రహం కోసం వెచ్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం 1500 కోట్లు 'బిచ్చమేసిన' కేంద్రం, పటేల్‌ విహ్రం కోసం 3 వేలకోట్లు ఖర్చు చేయడమేంటి.? అంటూ జనం సోషల్‌ మీడియా వేదికగా చాలాకాలం నుండే కడిగిపారేస్తున్న విషయం విదితమే.

అయితే, బీజేపీ వాదన ఈ విషయంలో ఇంకోలా వుంది. చేసిన ఖర్చుని తిరిగి రాబట్టుకునే అవకాశం వుందనీ, పర్యాటకం ద్వారా ఆ మొత్తం తిరిగొచ్చేస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఓ వైపు పటేల్‌కి ఈ రకంగా గౌరవం ఇస్తూనే, ఇంకోపక్క పటేల్‌ విగ్రహం ద్వారా 'దండుకోబోతున్నాం' అన్నది బీజేపీ నేతల వెర్షన్‌. తెలివితేటలంటే ఇలాగే వుంటాయ్‌ మరి.!

ఇక, నిఖిల్‌ ట్వీట్‌కి సోషల్‌ మీడియాలో బోల్డంత రెస్పాన్స్‌ వస్తోంది. బీజేపీ మద్దతుదారులేమో నిఖిల్‌పై మండిపడ్తున్నారు. 'నీకెందుకు రాజకీయాలు.?' అంటూ ప్రశ్నించేస్తున్నారు. బీజేపీ వ్యతిరేకులేమో, 'నీలాంటి యువకులు ఇలాగే నిలదీయాలి.. కడిగి పారేయాలి..' అంటూ నిఖిల్‌ని ప్రోత్సహిస్తూ ట్వీట్‌లు వేసేస్తున్నారు.  

కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్