బ్లాక్ బస్టర్ నా? బ్రేక్ ఈవెన్ నా?

గద్దలకొండ గణేష్/వాల్మీకి వరుణ్ తేజ్ కు ఫిదా తరువాత అంతటి బ్లాక్ బస్టర్ అనిపించింది తొలి మూడురోజులు కూడా. సాధారణంగా సోమవారం ట్రెండ్ చూసి సినిమా భవిష్యత్ అంచనా వేస్తారు. అలాంటిది సోమవారం కూడా…

గద్దలకొండ గణేష్/వాల్మీకి వరుణ్ తేజ్ కు ఫిదా తరువాత అంతటి బ్లాక్ బస్టర్ అనిపించింది తొలి మూడురోజులు కూడా. సాధారణంగా సోమవారం ట్రెండ్ చూసి సినిమా భవిష్యత్ అంచనా వేస్తారు. అలాంటిది సోమవారం కూడా బాగానే అనిపించింది. సో, ఇక బయ్యర్లు సేఫ్ అన్న అంచనా కలిగింది. కానీ మంగళవారం, బుధవారం ట్రెండ్ చూస్తుంటే. షేర్ వస్తోంది కానీ, ఈ వస్తున్న షేర్ తో బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్ అవుతారా? లాభాలు కూడా వస్తాయా? అన్న అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో కలుగుతున్నాయి.

మంగళవారం నాటికి వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం క్లియర్ గా వుంది. కానీ సినిమా కలెక్షన్లు బుధవారం మరి కాస్త జారాయి. అందువల్ల నైజాం లాంటి ఒకటి రెండు ఏరియాలు బ్రేక్ ఈవెన్ కు దూరంగా వుండే ప్రమాదం కనిపిస్తోంది. ఈవారం కూడా సరైన సినిమా లేదు. అందువల్ల వీకెండ్ లో కాస్త జోరు పెరిగి చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ అవుతాయనే నమ్మకం ట్రేడ్ సర్కిళ్లలో కనిపిస్తోంది.

వాల్మీకి కన్నా ముందుగా విడుదలైన గ్యాంగ్ లీడర్ కూడా ఫస్ట్ వీకెండ్ మంచిజోరు కనబరిచి, మండే నుంచి డౌన్ అయింది. అయితే రెంటల్ నుంచి షేర్ మీదకు మారి, థియేటర్లను స్లోగా షేర్ వస్తుండడంతో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్తోంది. వాల్మీకి ఆ సినిమా కన్నా వసూళ్లలో కాస్త బెటర్ ట్రెండ్ కనబర్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా గ్యాంగ్ లీడర్ మాదిరిగానే రెండువారాల రన్ లో జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది అనిపించేలా కనిపిస్తోంది.

నిజానికి బ్రేక్ ఈవెన్ అవ్వడం అన్నది పాయింట్ కాదు. అటు వరుణ్ తేజ్ కు, ఇటు హరీష్ శంకర్ కు పెద్ద బ్లాక్ బస్టర్ అనుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గర ఆగిపోవడం అన్నది పాయింట్. రాను రాను సినిమాల పరిస్థితి ఇలా తయారవుతోంది అన్నదే ఇంకో పాయింట్. కేవలం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల మీద, నాన్ థియేటర్ హక్కుల ఆదాయం మీద ఆధారపడి సినిమాల బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాల్సి వుంటుందేమో?

ప్రస్తుతం వాల్మీకి యూనిట్ మొత్తం థియేటర్ల టూర్ లో వుంది. బహుశా ట్రెండ్ ఇలా వుంటుందని గమనించే, ఈ టూర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. 

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు