చావుబతుకుల్లో ఉన్నప్పుడే గుర్తొస్తారా బాబు?

రెండు రాష్ట్రాలు, ఇద్దరు హాస్యనటులు.. ఇద్దరూ టీడీపీ వారే. కానీ పార్టీకి మాత్రం వీరిద్దరూ చావుబతుకుల్లో మాత్రమే గుర్తుకొచ్చారు. నా స్నేహితుడు, నాతో కలసి చదువుకున్నాడు, ఆయన చనిపోయాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకున్నానంటూ మొసలి…

రెండు రాష్ట్రాలు, ఇద్దరు హాస్యనటులు.. ఇద్దరూ టీడీపీ వారే. కానీ పార్టీకి మాత్రం వీరిద్దరూ చావుబతుకుల్లో మాత్రమే గుర్తుకొచ్చారు. నా స్నేహితుడు, నాతో కలసి చదువుకున్నాడు, ఆయన చనిపోయాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకున్నానంటూ మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు, మాజీ ఎంపీ శివప్రసాద్ ని చివరిచూపు ఎందుకు చూడలేకపోయారు. ఆయన అనారోగ్యం గురించి కబురందినా ఆఖరి క్షణాల్లో మాత్రమే ఆస్పత్రికి వెళ్లారు బాబు.

అప్పటికే శివప్రసాద్ క్లినికల్లీ డెడ్ అని తేల్చేసిన వైద్యులు, మరుసటి రోజు చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. అంటే చనిపోతాడని తెలిసిన తర్వాతే చంద్రబాబు, శివప్రసాద్ దగ్గరకు వెళ్లారు, కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వచ్చారు.

ఇక వేణుమాధవ్ విషయం తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా కెరీర్ మొదలుపెట్టి, సినిమాల్లోకి వచ్చినా మరోవైపు పార్టీలోనే కొనసాగుతూ అడపాదడపా ఉడతాభక్తిగా ప్రచారాల్లో పాల్గొన్నారు వేణుమాధవ్. నంద్యాల ఉప ఎన్నికల్లో అసలు అభ్యర్థి కంటే వేణుమాధవే ఎక్కువగా ప్రచారంలో కనిపించేవారు. పోనీ అదంతా కోదాడ అసెంబ్లీ టికెట్ కోసమే అనుకుందాం. అంతమాత్రాన వేణుమాధవ్ అంపశయ్యపై ఉంటే ఒక్క టీడీపీ నేత అయినా పలకరించారా?

కనీసం చంద్రబాబు అయినా వేణుమాధవ్ ఆరోగ్యం గురించి వాకబు చేయలేదు. పార్టీ తనను పట్టించుకోవడం ఏనాడో మానేసిందని గ్రహించిన వేణు, రాజకీయంగా ఎలాంటి ఉనికి, గుర్తింపు లేకుండానే చివరి రోజులు గడిపారు. అలా వేణుమాధవ్ ను వదిలేసిన టీడీపీ, తీరా ప్రాణం పోయిన తర్వాత సంతాపాలు స్టార్ట్ చేసింది. అది కూడా సోషల్ మీడియా వేదికగా మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి ఏం రాచకార్యాలున్నాయని ఇలాంటి కార్యక్రమాలకు కూడా వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారు.

ఇక కోడెల వ్యవహారం అందరికీ తెలిసిందే. కోడెల మానసికంగా కుంగిపోయారు, ఓసారి గుండెపోటు వచ్చిందని తెలిసినా కూడా ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా మరింత హింసించారు చంద్రబాబు. పరోక్షంగా ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారు. కార్యకర్తలే దేవుళ్లు అనే పార్టీలో ఏంటీ విపరీత ధోరణి. కార్యకర్తలు కాదు కదా నాయకుల్ని కూడా పూచిక పుల్లల్లా తీసేస్తున్నారు.

అవసరం ఉన్నంత వరకే. అవసరం తీరాక పొమ్మనలేక పొగబెడుతున్నారు. కనీసం కన్నెత్తి కూడా చూడడంలేదు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు నిజంగా కార్యకర్తలు పార్టీకి దేవుళ్లే. ఈ వైపరీత్యాలన్నీ చంద్రబాబు జమానాలో వచ్చినవే.

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు