బాబి ఫ్యూచర్ ఏసి-డిసి

దర్శకుడు బాబి (రవీంద్ర) తంతే బూరెల గంపలో పడ్డారు. పవర్ సినిమాలో చూపించిన పవర్ కు ఏకంగా పవర్ స్టార్ సినిమానే బహుమతిగా వచ్చేసింది. అంతవరకు బాగానే వుంది. కానీ అలాంటి ఇలాంటి స్టార్…

దర్శకుడు బాబి (రవీంద్ర) తంతే బూరెల గంపలో పడ్డారు. పవర్ సినిమాలో చూపించిన పవర్ కు ఏకంగా పవర్ స్టార్ సినిమానే బహుమతిగా వచ్చేసింది. అంతవరకు బాగానే వుంది. కానీ అలాంటి ఇలాంటి స్టార్ కాదు..కదా పవర్ స్టార్. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు..ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. డిసెంబర్ లో డైరక్ట్ గా సెట్ మీదకు వెళ్లిపోతుందని వార్తలు వినవచ్చాయి. 

ఎందుకంటే ఓ సారి కొబ్బరికాయ కొట్టుకున్నక, మళ్లీ ఆ లాంఛనాలు అనవసరం అని యూనిట్ భావిస్తున్నట్ల తెలుస్తోంది. కానీ డిసెంబర్ పది రోజులు గడిచిపోయాయి కానీ ఇంకా ఏ మాత్రం కొస అందడం లేదు. గోపాల గోపాల పూర్తయి పవన్ రిలీవ్ అయిపోతే, ఇక ఈ సినిమాపై దృష్టి పెడతారు. లేదా కాస్త రెస్ట్ కావాలి అంటే మరి కాస్త టైమ్ పడుతుంది. 

అయితే చకచకా జరిగిపోవడానికి ఎంత అవకాశం వుందో, అంతకు అంతా ఆలస్యం కావడానికి అంత అవకాశమూ వుంది. అంతవరకు బాబి వేచి వుండాల్సిందే. మరో సినిమా టచ్ చేయడానికి లేదు. కావాలంటే స్క్రిప్ట్ లు హ్యాపీగా తయారుచేసుకోవచ్చు. సినిమా లేటుగా పూర్తయినా హిట్ కొట్టిందా రవీంద్ర  రేంజ్ ఇక ఎక్కడికో వెళ్లిపోతుంది. లేదూ ఇలా నాన్చుతూ వుంటే మరో సంపత్ నంది అయిపోతారు.