సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ డాన్‌లా వుండేవాడు

సినిమాల్లోకి అప్పుడప్పుడూ నిజమైన విలన్లు రంగ ప్రవేశం చేసిన చరిత్ర కూడా వుంది. ముక్కా నరసింగరావు, రాంరెడ్డి, నర్సింగ్‌ యాదవ్‌ లాంటివాళ్ళకు కొంత విలన్‌ చరిత్ర వుంది. అలాగే విలన్‌ కమ్‌ హీరో శ్రీహరి…

సినిమాల్లోకి అప్పుడప్పుడూ నిజమైన విలన్లు రంగ ప్రవేశం చేసిన చరిత్ర కూడా వుంది. ముక్కా నరసింగరావు, రాంరెడ్డి, నర్సింగ్‌ యాదవ్‌ లాంటివాళ్ళకు కొంత విలన్‌ చరిత్ర వుంది. అలాగే విలన్‌ కమ్‌ హీరో శ్రీహరి కూడా సినిమాల్లోకి రాకముందు పహిల్వాన్‌లా పేరు పొందాడు. 

సినిమాల్లోకి వచ్చాక కూడా ఎప్పుడూ గ్యాంగ్‌స్టర్‌లా పది మందిని వెంటపెట్టుకు తిరిగేవాడు. అలాగే ఆర్టిస్టులకు పేమెంట్లు ఎగ్గొట్టిన నిర్మాతలను హెచ్చరించి బాధితులకు న్యాయం చేసేవాడట. అలాగే భాగస్వామ్య నిర్మాతల్లో తగవులు వచ్చినా, బాకీలు ఎగ్గొట్టినా శ్రీహరి కలగజేసుకుని సెటిల్‌మెంట్స్‌ చేసేవాడట. సివిల్‌ తగాదాలు తీర్చడంలో దాసరి నారాయణరావుకి ఎంత పేరుందో, క్రైమ్‌ తగువులు తీర్చడంలో శ్రీహరికి కూడా అంతే పేరుందని చెబుతుంటారు. 

అందుకే శ్రీహరితో పనిచేయించుకునే నిర్మాతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన పేమెంట్‌ని అణా పైసలతో సహా లెక్కగట్టి ఇచ్చేసేవారట. అలాగే శ్రీహరి కూడా తన చుట్టూ తిరిగే పదిమందికీ అన్నం పెట్టి, అవసరాలు తీర్చేవాడట. రియల్‌ డాన్‌ శ్రీహరి లేకపోవడం దురదృష్టకరం.