గ్లామర్ హీరోయిన్స్‌కి స్కిన్‌షోతోపాటు, భక్తి భావం కూడా ఎక్కువే వుంటుందని వయ్యారి భామ శ్రియను చూస్తే అర్థం అవుతుంది. ఈమెకు చిన్నతనం నుండీ భక్తి ఎక్కువేనట. అమమ్మ తులసి పూజలు చేస్తుంటే దగ్గరుండి గమనించేదట. కథక్ డాన్స్ నేర్చుకునేటప్పుడు మడమ నొప్పులకు ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేసరికి స్వామి నారాయణ్ టెంపుల్‌లో పూజలు చేయించుకుంటే ఇట్టే తగ్గిపోయాయని తన ఆధ్మాత్మిక అనుభవాల్ని చాటుకుంటుంది.
షూటింగ్ కోసం ఏ రాష్ట్రం వెళ్ళినా స్థానికంగా వుండే పెద్ద టెంపుల్స్‌ని దర్శించుకోవడం తప్పనిసరిగా చేస్తుందట. మన రాష్ట్రంలో తిరుపతి వెంకన్న అంటే అమితమైన భక్తిభావాలున్నట్లు కూడా చెబుతుంది శ్రియ.
‘నువ్వే నువ్వే’ సినిమాలోనూ, ‘ఛత్రపతి’ సినిమాలోనూ తాను ఎంతో గ్లామర్‌గా కనిపించానని ప్రేక్షకులు ఇప్పటికీ చెబుతంటారు. నేను దర్శించుకున్న దేవుళ్ళు నన్ను చల్లగా చూస్తుంటారు. నా ఆరోగ్యం, గ్లామర్ అన్నీ దేవుళ్ళ వరమే.. అంటున్న శ్రియకు బాబాల పట్ల కూడా భక్తి భావం వుందట. షిరిడీ సాయిబాబాని స్మరించుకుంటుందట. భక్తిభావంతో కూడిన పాత్రలు వస్తే చేయడానికి కూడా శ్రియ ఆసక్తి చూపిస్తుంది.