బాబికి తెలుసునా ఏం జరుగుతోందో?

గబ్బర్ సింగ్ 2 షూటింగ్ చకచకా సాగుతోంది. మూడు యూనిట్లు పెట్టి, మూడు చోట్ల కానిచ్చేస్తున్నారు. అంతా కలిపి ఇంక నెల రోజుల సమయం కూడా లేదాయె. హీరో పవన్ ఈ యూనిట్ నుంచి…

గబ్బర్ సింగ్ 2 షూటింగ్ చకచకా సాగుతోంది. మూడు యూనిట్లు పెట్టి, మూడు చోట్ల కానిచ్చేస్తున్నారు. అంతా కలిపి ఇంక నెల రోజుల సమయం కూడా లేదాయె. హీరో పవన్ ఈ యూనిట్ నుంచి ఆ యూనిట్ కు పరుగులు పెడుతుంటే, వెనుక వెళ్లి, టేక్..కట్..ఓకె అని చెప్పడం దర్శకుడు బాబి వంతు అవుతోందట. 

మిగతా వ్యవహారాలన్నీ పవన్ స్వయంగా చూసుకుంటున్నట్లు వినికిడి. ఒక విధంగా పేరుకు మాత్రమే బాబి దర్శకుడని, కానీ చేస్తున్నదంతా పవన్ మాత్రమే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులతో పాటే బాబికి కూడా సినిమా ఎలా వచ్చిందో తెలుస్తుందేమో అన్న చతుర్లు కూడా వినిపిస్తున్నాయి. 

గబ్బర్ సింగ్ 2 కథ, కథనాల విషయంలో పవన్ స్వయంగా ఇన్ వాల్వ్ అయ్యారన్న సంగతి తెలిసిందే. పైగా పవన్ సాధారణంగా కొరియోగ్రఫీ, ఫైట్స్ వంటి వాటిలో అవగాహనతో వుంటారు..తాను ఐఢియలు ఇస్తుంటారు. అందువల్ల ఇక ఏముంటుంది బాబి చేయడానికి హీరో కాకుండా మిగిలిన కాంబినేషన్లను డైరక్ట్ చేయడం మినహా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.