వరుణ్ తేజ్..మెగాఫ్యామిలీలో ఒక హీరో. మంచి ఫ్యూచర్ వుందని అనిపించుకుంటున్న ఈ హీరో ఫ్లాపు డైరక్టర్లకు డెస్టినేషన్ గా మారాడు. రెండో సినిమా చేసింది డైరక్టర్ క్రిష్ తో. అప్పటికి క్రిష్ కృష్ణం వందే జగద్గురం వంటి ఫ్లాప్ తో వున్నారు. హిందీ సినిమా సంగతి పక్కన పెడితే. ఇక ఆ తరువాత పూరి తో లోఫర్ సినిమా చేసాడు వరుణ్. దాని ముందు పూరి పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తరువాయి సినిమా శ్రీనువైట్లతో చేస్తున్నారు. ఆగడు..బ్రూస్ లీ వంటి ఫ్లాపులతో వున్నాడు శ్రీనువైట్ల.
అంటే ముచ్చటగా ముగ్గురు డైరక్టర్లకు లైఫ్ ఇచ్చినట్లయింది. అయితే వారు ఎవరూ ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకున్నట్లు లేదు. కంచె దర్శకుడు క్రిష్ కు పేరు తెచ్చింది కానీ మరో సినిమా తేలేదు. అలాగే పూరికి లోఫర్ మరింత కిందకు తోసింది తప్ప నిలబెట్టలేదు. మరి శ్రీనువైట్ల ఏం చేస్తాడో? హీరో దొరికాడు..సినిమా దొరికింది అనుకంటే చాలదు..విజయం సాధించాలి అనుకోవాలి. లేదంటే మళ్లీ ఆదుకోవడానికి మరో వరుణ్ తేజ్ దొరకడం కష్టం.అవును ఇంతకీ వరుణ్ తేజ తరువాయి చాన్స్ అందుకోవడానకి ఎవరు రెడీగా వున్నారో?