Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబీతో సినిమాకు ఎన్టీఆర్ ఫిక్సయ్యాడా?

బాబీతో సినిమాకు ఎన్టీఆర్ ఫిక్సయ్యాడా?

ఇటీవల ఏ మీడియా చూసినా ఎన్టీఆర్ సినిమాపై గ్యాసిప్ లే. ఎన్టీఆర్ ఎంతకు ఏ సబ్జెక్ట్ ఓకె చేయకపోవడంతొ, ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తున్నారు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సయోధ్య కుదిరిందని, పూరి ని బాలయ్యకు ఇచ్చి, కృష్ణ వంశీని ఎన్టీఆర్ తీసుకున్నాడని అనేంత వరకు. ఇంతకన్నా జోక్ మరోకటి లేదు.

ఎందుకంటే పూరి జగన్నాద్ సబ్జెక్ట్ ను ఎన్టీఆర్ అస్సలు ఓకె చేయనే లేదు. ఎప్పుడో పక్కన పెట్టేసాడు. వేరే యంగ్ డైరక్టర్ల కథలే విన్నాడు, వింటున్నాడు. ఇక బాలయ్య దగ్గరకు పూరి జగన్నాధ్ మాత్రం రాయాబారాలు నడుపుతున్నారని గుసగుసలు అయితే వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ తన తరువాతి సినిమా మీద  గురు, శుక్రవారాల్లో ఓ ఫైనల్ డెసిషన్ కు వస్తారని బోగట్టా. 

అదెలా అంటే డైరక్టర్ బాబి ఓ మాంచి కథ చెప్పారు. అది ఎన్టీఆర్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. రెగ్యులర్ కోన వెంకట్ అండ్ కో ఫార్ములాలో కాకుండా, డిఫరెంట్ గావుంది. అయితే అనిల్ రావిపూడి కూడా ఓ లైన్ చెప్పారు. అది కూడా బాగుంది. ఈ లైన్ కు సంబంధించి ఫుల్ నెరేషన్ గురు, శుక్రవారాల్లో వుంటుంది. 

అప్పుడు రెండింటిలో ఏది బెటర్ అన్నదాన్ని బట్టి, ఎన్టీఆర్ సినిమా ఎవరితో అన్నది వుంటుంది. ఆ ప్రకటన కూడా ఈవారమే వుంటుంది అన్నది పక్కా వార్త. ఇప్పటి వరకు అయితే బాబి కథ వైపే ఎన్టీఆర్ మొగ్గుతో వున్నారు. మరి అనిల్ రావిపూడి అద్భుతమైన నెరేషన్ ఇస్తే ఆ మైండ్ సెట్ మారుతుందేమో? జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?