సాహో కోసం బాలీవుడ్ బ్యూటీ

ప్రభాస్ నెక్ట్స్ మూవీ సాహో కోసం హీరోయిన్ వేట మొదలైంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్ల పేర్లు అనుకొని డ్రాప్ అయింది యూనిట్. ఎందుకంటే సాహో సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాబోతోంది.…

ప్రభాస్ నెక్ట్స్ మూవీ సాహో కోసం హీరోయిన్ వేట మొదలైంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్ల పేర్లు అనుకొని డ్రాప్ అయింది యూనిట్. ఎందుకంటే సాహో సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాబోతోంది. కాబట్టి ఈ 3 భాషలకు కనెక్ట్ అయ్యే హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అయితేనే అన్ని భాషలకు కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

గతంలో మహేష్ సినిమా కోసం పరిణీతి చోప్రాను అనుకొని ఆఖరి నిమిషయంలో ఆ నిర్ణయం నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం సాహో యూనిట్ కన్ను కత్రినాకైఫ్, దీపికా పదుకోన్ పై పడింది. అయితే దీపిక ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. మరో హాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసే ఆలోచనలో ఉంది.

కత్రిక కైఫ్ కు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆమెను మరోసారి సోహో సినిమాతో టాలీవుడ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మరోవైపు మహేష్-కొరటాల సినిమాకు ఫైనల్ అయిన కైరా అద్వాణి పేరును కూడా పరిశీలిస్తున్నారు. వచ్చేనెల 10 నుంచి సాహో సినిమా సెట్స్ పైకి వస్తుందంటున్నారు.