నాని రేంజ్‌ బాగా పెరిగిందండోయ్‌

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మార్కెట్‌ బాగా పెరిగింది. అతని తదుపరి చిత్రం 'నిన్ను కోరి'కి తను తప్ప మరో సెల్లింగ్‌ పాయింట్‌ లేకపోయినప్పటికీ ఇరవై కోట్లకి పైగా బిజినెస్‌ జరిగింది. దిల్‌ రాజు…

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మార్కెట్‌ బాగా పెరిగింది. అతని తదుపరి చిత్రం 'నిన్ను కోరి'కి తను తప్ప మరో సెల్లింగ్‌ పాయింట్‌ లేకపోయినప్పటికీ ఇరవై కోట్లకి పైగా బిజినెస్‌ జరిగింది. దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి వచ్చిన 'నేను లోకల్‌'తో సమానంగా 'నిన్ను కోరి'కి కూడా బిజినెస్‌ జరగడాన్ని బట్టి నానికి ఇరవై కోట్ల మార్కెట్‌ వేల్యూ వుందని తేలింది.

గతంలో నాని చిత్రాలకి పన్నెండు, పద్నాలుగు కోట్ల మధ్య బిజినెస్‌ జరిగేది. ఇప్పుడు అది ఇరవై కోట్ల వద్ద స్టెబులైజ్‌ అయింది. నిన్ను కోరితో కూడా నాని పాతిక కోట్లకి పైగా బిజినెస్‌ చేస్తే కనుక అతని తదుపరి చిత్రాలు పాతిక కోట్లకి తక్కువ చేయవు.

ఒక హీరో స్థాయి రెండు, మూడు కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు గ్రాడ్యువల్‌గా పెరిగిన వైనం నాని కెరీర్‌ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం మీడియం రేంజ్‌ హీరోల్లో నాని చూపిస్తోన్న నిలకడ మరే హీరోకీ లేదు. హిట్లు వస్తున్నా మాస్‌ చిత్రాలంటూ పంథా మార్చుకోకుండా, కథలని నమ్ముకోవడం నానికి ఈ రేంజ్‌ తెచ్చిపెట్టింది.