టాప్ హీరోల జాబితాలో వున్న ఎన్టీఆర్-చరణ్ లాంటి వాళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. వీరికే కాదు, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రతి హీరోకి అదే సమస్య. మళ్లీ పాన్ ఇండియా సినిమానే చేయాల్సిన తప్పనసరి సమస్య వచ్చి పడింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇప్పుడు ఈ దిశగానే ఆలోచిస్తున్నారట.
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా చేస్తున్నారు. ఇది పాన్ సినిమా ఇండియా సినిమా గా చేయాలని అనుకోవడం లేదు. సినిమా ఓ కొలిక్కి వచ్చాక దాని సంగతి ఆలోచిస్తారు. ఆర్ఆర్ఆర్ తరువాత కనుక కాస్త లో ప్రొఫైల్ లోనే వెళ్తారు. కానీ ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా సినిమానే.
ఇక ఆ తరువాత ఏంటీ అన్నది ప్రశ్న. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ డైరక్టర్ల కోసం చూస్తున్నారు. సరైన బాలీవుడ్ డైరక్టర్ దొరికితే మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.
ఇక చరణ్ పరిస్థితి అదే. ఆర్ఆర్ఆర్ తరువాత శంకర్ తో సినిమా చేస్తున్నారు. ఆది ఏ రేంజ్ సినిమా అన్నది అందరికీ తెలిసిందే. దాని తరువాత మళ్లీ సుకుమార్ తో ఓ పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. అది కూడా మైత్రీ మూవీస్ నిర్మాణమే. ఆ తరువాత మళ్లీ పాన్ ఇండియా సినిమా అందించగలిగే డైరక్టర్ కోసం చూస్తున్నారు.
ఈ లెక్కన మన తెలుగు టాప్ డైరక్టర్లు తమ స్థాయికి తగిన హీరోల కోసం వెదుకులాట సాగించాలి..అలాగే టాప్ హీరోలు తమ లెవెల్ కు తగ్గ డైరక్టర్ల కోసం వేట సాగించాలి.