బన్నీ-బోయపాటి సినిమా అన్నది ఎప్పటి నుంచో వార్తల్లో నానుతోంది. ఆఖరికి అది కన్ ఫర్మ్ అయిందని, సత్యమూర్తి తరువాత సినిమా బోయపాటిదేనని వార్తలు వచ్చాయి. బోయపాటి కూడా ఈ సినిమాపై పని చేస్తున్నారని వినికిడి. అందుకే బెల్లంకొండ శీను సినిమా కూడా వదిలేసాడు.
కానీ ఇప్పుడు బన్నీ మాటలు వింటుంటే బోయపాటి సినిమా ఇప్పుడు ఇమ్మీడియట్ గా వుంటుందా అని అనుమానం కలుగుతోంది. బోయపాటి సినిమా ప్రాజెక్టు ఇంకా చర్చల్లోనే వుందటున్నాడు బన్నీ.
అంటే లైన్ ఓకె అయినట్లా? కానట్లా? లైన్ ఓకె కాకుంటే ఇప్పుడు సత్యమూర్తి తరువాత లైన్ లోకి మరే డైరక్టర్ అయినా ఎంటరైపోయే అవకాశం వుంది. సత్యమూర్తి హిట్ అనిపించుకుంటే బన్నీ రేంజ్ కూడా మారిపోతుంది. దాంతో ప్లాన్ లు మారుతాయి. అందువల్ల బోయపాటి సినిమా పై కొత్త గ్యాసిప్ లు పుట్టే అవకాశం ఏర్పడుతోంది.