బోయపాటి సినిమాకు తొందరేలనో?

మూఢం ఫిబ్రవరి వరకు వుండగానే ముహుర్తాలు, పట్టింపులు వున్న దర్శకుడు బోయపాటి తన తరవాతి సినిమాకు క్లాప్ కొట్టించే పనిలో వున్నారు. ఆయన రామ్ చరణ్ తో రూపొందించే సినిమాకు ఈనెల మూడో వారం…

మూఢం ఫిబ్రవరి వరకు వుండగానే ముహుర్తాలు, పట్టింపులు వున్న దర్శకుడు బోయపాటి తన తరవాతి సినిమాకు క్లాప్ కొట్టించే పనిలో వున్నారు. ఆయన రామ్ చరణ్ తో రూపొందించే సినిమాకు ఈనెల మూడో వారం ఆరంభంలో క్లాప్ కొట్టించేస్తారని తెలుస్తోంది. కానీ బోయపాటి ఇలా ఎందుకు హడవుడి పడుతున్నారో? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే హీరో రామ్ చరణ్  ఇంకా రంగస్థలం నుంచి విడుదల కాలేదు. ఆ సినిమా పని అలా సా…గుతూనే వుంది. సంక్రాంతికి విడుదల అనుకున్న సినిమా అజ్ఖాతవాసి కారణంగా మార్చి ఆఖరుకు వెళ్లింది. కానీ చిత్రంగా సినిమా వర్క్ మాత్రం సంక్రాంతికి పూర్తి కాలేదు. ఇంకా మరో ఇరవై రోజుల షూటింగ్ వర్క్ వుందని తెలుస్తోంది.

ప్రస్తుతం నైట్ షూట్ లో ఫైటింగ్ సీన్లు తీస్తున్నారు. కీలకమైన రెండు పాటల షూటింగ్ మిగిలే వుంది. వాటికే పది రోజులు కావాలి. అంటే వరుసగా వర్క్ చేసినా జనవరి నెలాఖరు వరకు పని వుంది. కానీ సంక్రాంతి, ఇతరత్రా వ్యవహారలతో ఫిబ్రవరి వచ్చేస్తుంది. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ . ఈ లెక్కన మార్చిలో రంగస్థలం విడుదల డేట్ వరకు టెన్షన్ వుండేలాగే కనిపిస్తోంది. మరో పక్క నిర్మాత దానయ్య కూడా బిజీగానే వున్నారు. ఆయన మహేష్ బాబు సినిమా హడావుడితో వున్నారు. 

మరి పరిస్థితి ఇలా వుంటే బోయపాటి తన సినిమా గురించి ఎందుకు హడావుడి చేస్తున్నారో? మమ అనిపించుకుంటే ఓ పని అయిపోతుందనేమో?