వైవిధ్యమైన సినిమాలు చేయడంలో తమిళ్ హీరో విశాల్ ముందుంటాడు. ఆ మధ్య చేసిన డిటెక్టివ్ సినిమా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పండుగ తరువాత కొత్తగా అభిమన్యుడు అంటూ వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ బయటకు వచ్చింది.
ఈసారి కూడా కచ్చితంగా వైవిధ్యమైన సబ్జెక్ట్ తీసుకున్నాడని టీజర్ చెప్పకనే చెప్పింది. ఈ సారి విశాల్ సైబర్ క్రయిమ్ ను సబ్జెక్ట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్మార్ట్ ఫోన్ లు వాడకం పెరగడంతో, డేటా, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ జనాలకు బాగా తెలిసింది. మరో పక్క ఆధార్ డేటా గురించిన రకరకాల ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో విశాల్ ఈ పాయింట్ ను తీసుకుని సినిమా చేయడమే కాకుండా, చాలా టెక్నికల్ విషయాలను కూడా డిస్కస్ చేసినట్లు కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. హీరోగా విశాల్ రేపిన ఆసక్తి కన్నా, విలన్ గా అర్జున్ కలిగించిన ఆసక్తే ఎక్కువ టీజర్ లో. ఇలాంటి సినిమాలో హీరోయిన్ కు వుండే రోల్ సహజంగానే తక్కువ వుండే అవకాశం వుంది. టీజర్ లో హీరోయిన్ సమంత కనిపించిన వైనం కూడా అలాగే వుంది.