Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బోయపాటి-దానయ్య.. హాట్ హాట్

బోయపాటి-దానయ్య.. హాట్ హాట్

వినయ విధేయరామ సినిమా సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా వ్యవహారం నిర్మాత దానయ్యకు దర్శకుడు బోయపాటికి మధ్య తారాస్థాయిలో వాదోపవాదాలు జరిగినట్లు తెలుస్తోంది. వినయ విధేయరామ సినిమా విడుదల తరువాత వచ్చిన ఫలితంతో హీరో రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయానికి దర్శకుడు బోయపాటి తలవొగ్గకపోవడం అన్నది ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది.

టోటల్ వ్యవహారం ఇలావుంది. సినిమా విడుదలైన తరువాత ఫలితం తేలిపోవడంతో రామ్ చరణ్య ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ ఓ లేఖ తయారు చేయించారు. (అదే కొద్దిరోజుల క్రితం విడుదల చేసింది). కానీ సినిమా పండగ సీజన్ లో ఫుల్ రన్ క్లోజ్ అయ్యేవరకు ఆగాలని చరణ్ కు సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆగిపోయారు. ఆఖరికి టోటల్ గా బయ్యర్లు ముఫైకోట్ల వరకు లాస్ అని లెక్కతేల్చారు.

దాంతో తన రెమ్యూనిరేషన్ నుంచి అయిదు కోట్లు వెనక్కు ఇస్తానని, మీరూ తలా అయిదు ఇస్తే యాభైశాతంగా పదిహేను కోట్లు వెనక్కు ఇచ్చేయవచ్చని రామ్ చరణ్ ప్రతిపాదించారు. దానికి నిర్మాత దానయ్య ఓకె అన్నారు. అక్కడి నుంచి బోయపాటికి కబుర్లుచేయడం, సరైన స్పందన రాకపోవడం జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో దిల్ రాజును పెద్దమనిషిగా పెట్టి నిన్ననో, మొన్ననో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో తాను అయిదు కోట్లు ఇవ్వలేనని, ఒకటో రెండో ఇస్తానని బోయపాటి చెప్పినట్లు తెలుస్తోంది. 15కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుని, వందకోట్లు ఖర్చు పెట్టించి, ఇలాంటి సినిమా ఇచ్చి, ఇప్పుడు వెనక్కు ఇవ్వనంటే ఎలా అని దానయ్య నిలదీసినట్లు తెలుస్తోంది.

దాంతో అలా అలా మాటా మాటా పెరిగిపోయింది. ఇద్దరూ ఒక స్థాయిలో గట్టిగా బూతులు తిట్టుకున్నట్లు తెలుస్తోంది. దాంతో మధ్యన వున్న పెద్ద మనుషులు విడదీసినట్లు తెలుస్తోంది. 

బోయపాటి సైడ్ నుంచి

ఇదే విషయంపై బోయపాటి సన్నిహితులు చెబుతున్న వెర్షన్ వేరుగా వుంది. బోయపాటికి 15 కోట్ల రెమ్యూనిరేషన్ ఇవ్వలేదని అంటున్నారు. అలాగే బోయపాటి డబ్బులు ఇవ్వను అని అనలేదని, అసలు సినిమాకు కచ్చితంగా ఎంతయింది? ఎంతకు అమ్మారు? ఎంత మిగిలింది? ఈ లెక్కలు అన్నీ పక్కాగా చూపించమని బోయపాటి అడుగుతున్నారని, ఆ తరువాతే తను ఇవ్వాల్సింది ఇస్తానని అంటున్నారని చెబుతున్నారు. సినిమాకు అందరూ అనుకుంటున్నట్లు మరీ వంద కోట్లు దాటి అయిపోలేదని, 90 కోట్ల వరకే అయిందన్నది బోయపాటి మిత్రుల మాట.

NTR పరువు తీసింది చంద్రబాబా? దగ్గుబాటా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?