Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'తేజు' కోరక తీరబోతోందా?

'తేజు' కోరక తీరబోతోందా?

సాయిధరమ్ తేజ్... మెగా హీరోల్లో బాగా స్ట్రగుల్ అవుతున్న ఒకే ఒక్కడు. సరైన సినిమా కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు తనలోపం లేకుండా. కానీ అదే దగ్గరకు రావడంలేదు. అలాంటి తేజుకు ఎప్పటి నుంచో రెండు బకాయిలు వున్నాయి.

ఒకటి గీతాఆర్ట్స్ లో సినిమా. రెండు మారుతి డైరక్షన్ లో సినిమా. అటు గీతా, ఇటు మారుతి రెండూ తేజకు అత్యంత దగ్గరే. కానీ ఆ కోరికలే తీరడంలేదు. ఇప్పుడు ఈ రెండు కోరికలు ఒకేసారి తీరే చాన్స్ వున్నట్లు తెలుస్తోంది.

మారుతి డైరక్షన్ లో, గీతా2 బ్యానర్ మీద తేజు హీరోగా ఓ ప్రాజెక్టు సెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. పనిలో పనిగా లక్కీ బ్యానర్ యువి కూడా దీంట్లో చేయికలిపే అవకాశం వుందని తెలుస్తోంది. వాస్తవానికి నాని-మారుతి కాంబినేషన్ సెట్ అవుతుందని ఆ మధ్య వినిపించింది. ఆ దిశగా వ్యవహారం నడుస్తోంది.

అయితే నాని డేట్ లు దొరకాలి. ప్రస్తుతం వున్న కమిట్ మెంట్లు పూర్తికావాలి. మరి ఈలోగా మారుతి ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇటు వస్తున్నారేమో? ఏమయితేనేం మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ లాంటి కాంబినేషన్ లో తేజు ఎంటర్ అవుతున్నాడు. హిట్ కొడతాడనే అనుకుందాం.

NTR పరువు తీసింది చంద్రబాబా? దగ్గుబాటా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?