గీతా ఆర్ట్స్ కు ఎక్కడన్నా డైరక్టర్ కానీ కథ దగ్గర మాత్రం కాదు. కథ విషయంలో ఎట్టి పరిస్ఢితుల్లోనూ రాజీ అన్నది అరవింద్ దగ్గర కుదరదు. అందునా అత్తారింటికి దారేది జోష్ లో పడి సత్యమూర్తిని కాస్త చూసీ చూడనట్లు వదిలేసారు దాంతో ఇప్పడు తాళాలు మరింత బిగించేసారు అరవింద్. దీని ఎఫెక్ట్ దర్శకుడు బోయపాటికి తెలిసి వచ్చింది.
బన్నీతో బోయపాటి సినిమా గత నెలలోనే పట్టాలెక్కించేద్దామనుకున్నారు. కానీ తీరా చూస్తే అరగంట సినిమా అదీ క్లయిమాక్స్ ముందు స్క్రిప్ట్ అరవింద్ కు నచ్చలేదు. టాట్ వీల్లేదు కాక వీల్లేదు..మళ్లీ మార్చి మంచిగా రెడీ చేయమని నిర్మోహమాటంగా చెప్పేసాడు.
దాంతో ఇంక ఇప్పుడు పనేం లేదని బన్నీ సమ్మర్ క్యాంప్ కు వెళ్లిపోయాడు. చేసేది లేక బోయపాటి, మళ్లీ ఈ అరగంట వ్యవహారాన్ని మార్చి అరవింద్ కు నచ్చేలా తయారు చేయడానికి కిందా మీదా అవుతున్నారు. ఆ మాత్రం కేర్ తీసుకుంటారు కనుకనే గీతా ఆర్ట్స్ సినిమాలు మినిమమ్ గ్యారంటీతో వుంటాయి.
అన్నట్లు ఇటీవల ఈ వైనం చిన్న తెరపై నుంచి పెద్ద తెరపైకి వద్దామనుకున్న ప్రభాకర్ కు కూడా తెలిసివచ్చిందట. లైన్ ఓకె అన్నారు. తీరా చేసి డైలాగ్ వెర్షన్ తయారు చేసేన తరువాత పెదవి విరిచేసారు. ఇప్పుడు అక్కడా పని మళ్లీ మొదటికి వచ్చింది.