కమెడియన్ నుంచి హీరోగా మారి, అక్కడి నుంచి మళ్లీ రెగ్యులర్ వేషాలతో పాటు విలన్ వేషాలు కూడా ప్రారంభించాడు సునీల్. ఇప్పుడు లేటెస్ట్ గా పౌరాణిక వేషాలు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ వెబ్ సిరీస్ కోసం బ్రహ్మగా అవతారం ఎత్తినట్లు బోగట్టా. గతంలో కమెడియన్ కమ్ హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా బ్రహ్మగా ఓ సినిమా చేసేసారు. ఇప్పుడు సునీల్ వంతు.
గతంలో కలర్ ఫోటోకు పని చేసిన కొందరు నటులు, టెక్నీషియన్లు కలిసి, ఓ వెబ్ సిరీస్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. అందులో సునీల్ బ్రహ్మగా నటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ వెబ్ సీరిస్ ను మార్కెట్ చేసి, విడుదల చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
సునీల్ ప్రస్తుత ఓ ఓటిటి సినిమాను కూడా ఎకె బ్యానర్ లో ఫినిష్ చేసారు. అలాగే హిందీలో ఒక వెబ్ సిరీస్ లో చేసే ఆఫర్ ను పరిశీలిస్తున్నారు.