ఇటీవలి కాలంలో బ్రహ్మానందం అలరించిన సినిమా పేరు చెప్పండి అని అడిగితే కాస్త ఆలోచించకుండా సమాధానం చెప్పడం కష్టం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో బ్రహ్మీ ఓపెనింగ్ షాట్ చూసాక, ఆయన అభిమానులు ..కాస్త రిలీఫ్ ఫీలయ్యారు. కానీ రాను రాను ఆ పాత్ర.ఆ స్టయిల్.రొటీన్ వ్యవహారాలు చూసి తల పట్టుకున్నారు.
ఎందుకో సరైన పాత్రలు రాయలేకపోతున్నారో, బ్రహ్మీ మరీ రొటీన్ అయిపోయారో కానీ, క్లిక్ కావడం లేదు. అసలే సినిమాలు తగ్గిపోయాయి. వచ్చినవి కూడా అలరించడం లేదు. ఒకప్పుడు బ్రహ్మికి మంతచి పాత్రలు రాసిన రచయితలు కూడా వేరే వాళ్లను వెదక్కుంటున్నారు.
ఇప్పుడు బహ్మీ ఆశలన్నీ రామ్ చరణ్ బ్రూస్ లీ మీదే వున్నాయి. అది ఏ మాత్రం క్లిక్ అయినా మళ్లీ ఒక్కసారి విజృంభించేస్తాడు. పైగా శ్రీనువైట్ల కూడా బ్రూస్ లీలో బ్రహ్మీకి మంచి వెరైటీ రోల్ వుందని చెప్పి, ఆయన అభిమానుల్లో ఆశలు రేపుతున్నాడు. చూడాలి అదెంత సూపర్ గా వుంటుందో?