ఉత్తరాంధ్ర విలయానికి స్పందించి సినిమా జనం అంతా తమకు తోచిన విరాళం ప్రకటిస్తున్నారు. అయితే ఎవరూ అంతగా నిరాశపర్చడం లేదు. ఒక్క సినిమాలో నటించిన సంపూర్ణేష్ బాబు తో సహా. అతను లక్ష రూపాయిలు విరాళం ఇచ్చాడు. పూరి జగన్నాధ్ కుమారుడు బాలనటుడు ఆకాష్ లక్షన్నర విరాళం ఇచ్చారు. మన నటులు కాని సూర్య ఫ్యామిలీ భారీగా విరాళం అందించారు.
విశాల్ మాదిరిగా ఇబ్బందుల్లో వున్నవారు కూడా మంచి విరాళాలు అందించారు. కానీ సినిమా పరిశ్రమలో రోజుకు అయిదు లక్షలు పారితోషికం తీసుకుంటాడని ఇండస్ట్రీలో ఎవరిని అడిగానా చెప్పే మెగా కమెడియన్ బ్రహ్మానందం మాత్రం మూడు లక్షలు విరాళం ప్రకటించారు. డబ్బుల దగ్గర బ్రహ్మీ కాస్త పొదుపుగా వుంటారని అందరూ అంటారు. కానీ మరీ ఇంత పొదుపు అని ఇప్పుడే జనాలకు తెలిసింది.
మూడు వందల అరవై రోజులు నటించే బ్రహ్మీ ఆదాయం ఆదాయపన్ను శాఖ వారికి తెలియకపోవచ్చు కానీ, సినిమా జనాలు మాత్రం బాగా చెప్పుకుంటారు. రోజువారీ పారితోషికానికి తెరతీసింది బ్రహ్మీ అని, ఇప్పుడు ఆయన ఒక పూట అయితే మూడు లక్షలు, రోజుకు అయితే అయిదులక్షలు తీసుకుంటారని అంటారు. ఆ లెక్కన ఓ పూట ఆదాయం ఆయన తుపాను బాధితులకు విదిల్చారన్నమాట. ప్రజల అభిమానాన్ని బట్టి తమ పారితోషికం పెంచే నటులు ఆ ప్రజలకు కష్టం వచ్చినపుడు ఇలా కంజూస్ గా ఆలోచించించ బట్టే ఆర్జీవీ లాంటి వారు ట్విట్టర్ లో అలా సెటైర్లు వేసింది.