నాగశౌర్యతో కొర్రపాటి కటీఫ్?

నాగశౌర్య. రెండు సినిమాలు హిట్ తో టాలీవుడ్ లో కాస్త ఆశాజనకమైన కెరియర్ వుంటుందనుకుంటున్న యంగ్ హీరో. రెండు సినిమాలు హిట్ కావడంతో చాలా మంది ఇప్పుడు శౌర్య డేట్ లు అడుగుతున్నట్లు వినికిడి.…

నాగశౌర్య. రెండు సినిమాలు హిట్ తో టాలీవుడ్ లో కాస్త ఆశాజనకమైన కెరియర్ వుంటుందనుకుంటున్న యంగ్ హీరో. రెండు సినిమాలు హిట్ కావడంతో చాలా మంది ఇప్పుడు శౌర్య డేట్ లు అడుగుతున్నట్లు వినికిడి. కానీ కొర్రపాటితో మరో ఒకటి రెండు సినిమాల కమిట్ మెంట్ వుంది. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. 

నాగశౌర్య నిన్న మొన్నటి దాకా దిక్కులు చూడకు రామయ్యా పబ్లిసిటీకి తెగ ఉత్సాహం చూపించారు. కానీ ఇప్పుడు మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయి బాగా డిస్సపాయింట్ అయినట్లు బోగట్టా. సినిమా కు మంచి టాక్ వచ్చి, తొలినాళ్లలోనే రెండు కోట్ల షేర్ క్రాస్ చేసిన ఈ సమయంలో మరింత పబ్లిసిటీ చేస్తే ఇంకా బాగుంటుందన్న ఆలోచనలో ఆయన వున్నట్లు తెలుస్తోంది. కానీ శౌర్య వ్యవహారంతో ఇంక మరి ఆగిపోయినట్లు, భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా పునరాలోచిస్తున్నట్లు సాయి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇక్కడ చిన్న ట్విస్టు కూడా వుందని వినికిడి. హీరో ఎన్టీఆర్ మామగారు నార్నే శ్రీనివాసరావుకు శౌర్య దగ్గర బంధువట. నిర్మాత సాయి హీరో బాలకృష్ణకు బాగా సన్నిహితం. ఈ రాజకీయాలు కూడా శౌర్యను ప్రభావితం చేస్తున్నాయా అన్నది డౌటు.