ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఎంత మంచివాడవురా సినిమా ఫలితం తరువాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వున్నాడు.
ఏదో సమ్ థింగ్ ఇంట్రస్ట్ గా వుంటే తప్ప ఓకె అనడం లేదు. అందుకే పీరియాడిక్ సినిమాలు ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
బింబిసారుడి కథతో ఇప్పటికే ఓ హిస్టారికల్ ఫాంటసీ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత మరో పీరియాడిక్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 1950 బ్యాక్ డ్రాప్ లో ఒక కథను నిర్మాత అభిషేక్ నామా కు ఒకె చేసినట్లు తెలుస్తోంది.
కొత్త దర్శకుడు నవీన్ అందించే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో ప్రారంభం అవుతుంది. ఈ లోపున కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా రెండు భాగాలు పూర్తి చేస్తారు. వీలయితే మరో సినిమా కూడా చేసే అవకాశం వుంది.