Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘బ్రదర్స్’ సెటిలైపోయేలా వున్నారు

‘బ్రదర్స్’ సెటిలైపోయేలా వున్నారు

నిన్నిటి నిన్న 24 అడియో ఫంక్షన్ చూసిన వారికి అనిపించిన మాట ఇదే. సాధారణంగా సండే అడియో ఫంక్షన్ చేస్తే, జనాలు బాగానే వస్తారు. కానీ మండే అయినా కూడా మామూలు జనాలు, సినిమా జనాలు బాగా వచ్చారు అంటే..అది సూర్యకు వున్న క్రేజ్ తప్ప వేరు కాదు. 

నిజానికి సూర్య, కార్తీలకు తెలుగులో హిట్ లు తక్కువే. కానీ అవన్నీ గుర్తుండిపోయే హిట్ లు. అందుకే ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా వారికి ఇక్కడ ఆదరణ తగ్గడం లేదు. మొన్నటికి మొన్న ఊపిరి సినిమాతో కార్తీ మళ్లీ మరోసారి తెలుగువారి మనసులు గెల్చుకున్నాడు. ఇప్పుడు తెలుగు నిర్మాతలు మల్టీ స్టారర్ చేయాలంటే కార్తీ గురించి తప్పక ఆలోచిస్తారు. 

ఇక సూర్య తో ఇప్పటికే టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అయింది. దాని తరువాత పెద్ద డైరక్టర్ లు సూర్యతో సినిమా చేయడానికి రెడీ అంటారు. సో ఇక అన్నదమ్ములు నేరుగానే తెలుగు సినిమాలు ఎక్కువగా చేసే అవకాశం కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?