ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సినిమాలే సినిమాలు. టాలీవుడ్ కు పండగే పండగ. అయితే ఒక్క మే నెల మాత్రం యామా కన్ ఫ్యూజన్ గా వుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మోత్సవం మే 12న విడుదల చేయాలని మహేష్ క్లియర్ఆదేశాలు ఇచ్చేసాడట. మరీ గ్రేస్ పీరియడ్ అంటే వన్ వీక్ మాత్రమే అని స్పష్టం చేసాడట. దాంతో డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల కిందా మీదా అవుతున్నట్లు వినికిడి. ఈ నెలాఖరులోనే బ్రహ్మోత్సవం కు అడియో ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు.
దిల్ రాజు-అనిల్ రావిపూడి-సాయి ధరమ్ తేజ సినిమా సుప్రీమ్ ఈ నెల 29న విడుదల చేద్దాం అన్న ఆలోచన వుంది. కానీ సరైనోడు వేసిన వన్ వీక్ కు మరో మెగా ఫ్యామిలీ సినిమా ఎందుకు అన్న ఆలోచనలో వున్నారు. అందువల్ల మే లో ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడే వేద్దామనుకుంటున్నారు. ఆ విధంగా మే లో రెండో సినిమా రెడీ అవుతోంది.
ఇక త్రివిక్రమ్-నితిన్ ల అ..ఆ సినిమా ఫస్ట్ వీక్ కు ఫిక్సయిపోయింది. ఇది ఆ నెలలో మూడో పెద్ద సినిమా. ఇవన్నీ ఇలా వుంటే సూర్య-విక్రమ్ కుమార్ ల 24 కూడా మే లో నే రానుంది. ఇది కూడా చిన్న సినిమా కాదు..భారీ అంచనాలున్న సినిమానే. ఇక రజనీ కబాలి ఒకటి మిగిలి వుంది. ఇవన్నీ కూడా ఏవి ఎప్పుడు వస్తాయి అన్న దాంట్లో క్లారిటీ లేకుండా వున్నాయి..వాళ్లు ఫిక్సయితే వీళ్లు ఫిక్సవుతారు..వీళ్లు ఫిక్సయితే వాళ్లు ఫిక్సవుతారు అన్న టైపులో.
ఎవరు ఎప్పుడు వస్తారన్నది అలా వుంచితే ప్రేక్షకులకు మాత్రం సినిమాలే సినిమాలు.