ఈ ఐపీఎల్ మా కొద్దు..!

నీటి కరువు భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అనుకోవడం కాదు.. భవిష్యత్తుపై కాదు, నీటి కరువు వర్తమానాన్ని కూడా నరకప్రాయం చేస్తుందని చెప్పుకోవాలి ఇక! మండుతున్న ఎండల నేపథ్యంలో కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో…

నీటి కరువు భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అనుకోవడం కాదు.. భవిష్యత్తుపై కాదు, నీటి కరువు వర్తమానాన్ని కూడా నరకప్రాయం చేస్తుందని చెప్పుకోవాలి ఇక! మండుతున్న ఎండల నేపథ్యంలో కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో దాహార్తీ తీరితే చాలు.. ఇక ఏ వినోదమూ వద్దు అనే పరిస్థితి ఏర్పడింది. 

ఒకటి కాదు.. ఇప్పుడు రెండో రాష్ట్రం తరపు నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి!  ఈ మ్యాచ్ ల నిర్వహణ వద్దని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఐపీఎల్ మ్యాచ్ లు తమ రాష్ట్రం నుంచి తరలిపోతే తమకు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాయి.

మరి ఇండియన్ ప్రీమియర్  లీగ్ మ్యాచ్ ల నిర్వహణకు వెనుకడుగు వేయడం అంటే.. ఎన్నికలు జరుగుతున్నాయనో, భద్రతా ఏర్పాట్లకు జడిసో.. కాదు. నీటి కరువుతో! మ్యాచ్ ల నిర్వహణ అంటే అది భారీగా నీటి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి.. ఈ మ్యాచ్ లనిర్వహణ ను సవాల్ చేస్తూ పిటిషన్లు పడుతున్నాయి.

ముందుగా మహారాష్ట్రలో ఇలాంటి ఫిర్యాదులు నమోదయ్యాయి. ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకూ వేల లీటర్లల నీటి వినియోగం జరుగుతుందని… అసలే నీటి కరువుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న వేళ ఇలాంటి మ్యాచ్ల  అవసరమెంత? అని కోర్టు కూడా ప్రశ్నించింది. ఇక మహారాష్ట సీఎం ఫడ్నవీస్ అయితే.. మ్యాచ్ లు తరలిపోతే మేమేం బాధపడం అని స్పష్టం చేశాడు!  చివరకు తొలి మ్యాచ్ ఎలాగో జరిగిపోయింది.

ఇక ఇప్పుడు కర్ణాటకలో కూడా ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణను వ్యతిరేకిస్తూ పిల్ నమోదైంది. బెంగళూరులో నీటి లభ్యత రీత్యా మ్యాచ్ల నిర్వహణ నీటి కరువును రెట్టింపు చేస్తుందని.. సామాన్యలుకు తాగు నీటిని సరఫరా చేయలేని సర్కారు  ఐపీఎల్ మ్యాచ్ లకు మాత్రం ఎలా నీటిని సరఫరా చేస్తుందని ప్రశ్నిస్తూ బెంగళూరు హై కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. 

కోర్టులు కూడా ఇలాంటి విషయాల్లో ఫిర్యాదుదారుల పక్షనే నిలబడుతున్నాయి. దీంతో ఈ ఐపీఎల్ మా కొద్దు.. అనే అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి నీటి కరువు ప్రభావం క్రికెట్ వినోదాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేసినట్టే కదా!