బుచ్చిబాబు..ఎన్టీఆర్..లోకల్ ట్వీట్

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమాకు టోకెన్ నెంబర్ వచ్చింది. ఆర్ఆర్ఆర్…కొరటాల శివ సినిమా..ఆపై ప్రశాంత్ నీల్ మూవీ అన్న క్లారిటీ వచ్చింది. ఇలాంటి టైమ్ లో ఉప్పెన బుచ్చిబాబు కూడా…

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమాకు టోకెన్ నెంబర్ వచ్చింది. ఆర్ఆర్ఆర్…కొరటాల శివ సినిమా..ఆపై ప్రశాంత్ నీల్ మూవీ అన్న క్లారిటీ వచ్చింది. ఇలాంటి టైమ్ లో ఉప్పెన బుచ్చిబాబు కూడా ఓ ట్వీట్ వేసేసారు. 

LET'S CREATE A TREND telling a LOCAL STORY GLOBALLY

ఈ లైన్ బుచ్చిబాబు ట్వీట్ లో కీలకం. అంటే మళ్లీ పక్కా ఓ లోకల్ స్టోరీతో పాన్ ఇండియా సినిమా చేయాలన్న ప్రయత్నం ఏమో? బాగానే వుంది.

ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ వినిపిస్తోంది. కానీ ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల, ప్రశాంత్ నీల్ తరువాత ఎన్టీఆర్ చరిష్మా ఏ లెవెల్ లో వుండబోతోందో ఇప్పటికి ఊహించేది కాదు.

అలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ కోసం ఎవరెవరు వస్తారో? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. అలాంటిది బుచ్చిబాబుకు ఎన్టీఆర్ కమిట్ అయ్యారా? అన్నది ఓ అనుమానం. అలా కమిట్ అయి వుంటే దానికి కూడా ఓ టోకెన్ నెంబర్ ఇచ్చి వుండేవారు కదా?

సరే, ఆ సంగతి అలా వుంచినా 2022 ఆర్ఆర్ఆర్ కే సరిపోతుంది. కొరటాల సినిమా, ప్రశాంత్ నీల్ సినిమా 2023 అనుకుంటే బుచ్చిబాబు టర్న్ వచ్చేసరికి 2024 వస్తుంది. అంటే దాదాపు మూడేళ్లకు పైగా ఖాళీగా కూర్చుంటారా? లేక చరణ్ తోనో మరెవరితోనో ఓ ట్రయిల్ వేస్తారా? వెయిట్ అండ్ సీ.