దేశముదురులో తన సిక్స్‌ప్యాక్ దేహాన్ని చూపించాడు అల్లు అర్జున్. టాలీవుడ్‌లో చొక్కా విప్పిన తొలి హీరో… బన్నీనే. ఆ తరవాత అందరూ అదే దారిలో వెళ్లారు. ఇప్పుడు బన్నీ 8 ప్యాక్ చేయబోతున్నాడట.
అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తన సినిమాలోని హీరోని.. ధీరోదాత్తుడిగా చూపించడం బోయపాటికి అలవాటు. ఈ సినిమాలోనూ ఎమోషన్ కంటెంట్ చాలా ఉందట. అందుకోసం బన్నీ చేత 8 ప్యాక్ చేయించబోతున్నట్టు తెలిసింది.
కండలు పెంచి, హెయిర్ స్టైల్ మార్చమని బన్నీకి సలహా ఇచ్చాడట ఈ దర్శకుడు. ప్రస్తుతం బన్నీ ఆ పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఓ ప్రేమకథలో తన శైలి యాక్షన్ ని బాగా దట్టించి వదులుతున్నాడు బోయపాటి. మరి ఈ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.