బన్నీ సినిమా మే కు వాయిదా?

నాపేరు సూర్యకు సంబంధించి ఓ సీక్రెట్ ప్రకటన ఈ రోజు రాత్రి 10.30కి వస్తుందని అనౌన్స్ మెంట్ దాంతో అది ఏమై వుంటుందా? అన్న ఎంక్వయిరీలు. ప్రారంభమైపోయాయి. అయితే సినిమా సంగతులు అన్నీ దాదాపు…

నాపేరు సూర్యకు సంబంధించి ఓ సీక్రెట్ ప్రకటన ఈ రోజు రాత్రి 10.30కి వస్తుందని అనౌన్స్ మెంట్ దాంతో అది ఏమై వుంటుందా? అన్న ఎంక్వయిరీలు. ప్రారంభమైపోయాయి. అయితే సినిమా సంగతులు అన్నీ దాదాపు బయటకు వచ్చేసాయి. సినిమా షూట్ దాదాపు 70శాతం పూర్తయింది. ఏప్రిల్ విడుదల అంటున్నారు కానీ, అనుమానమే.

ఎందుకంటే ముఫై శాతం షూట్ అది కూడా విదేశాలతో పాటు దేశంలోని నలుమూలలా ఇంకా షూట్ చేయాల్సి వుంది. అందువల్ల మార్చి నాటికి సినిమా పూర్తవుతుంది అంటే అనుమానమే. కనీసం వన్ మంథ్ పోస్ట్ ప్రొడక్షన్ కే కావాలి. థర్టీ పర్సంట్ షూట్ అంటే కనీసం రెండు నెలల పైమాటే. అందువల్ల సినిమాకు కొత్త డేట్ ప్రకటిస్తారా? ఇంకేం చెబుతారు?

అది అలా వుంటే, నా పేరు సూర్య సినిమా టీజర్ ను జనవరి 1న విడుదల చేసే ప్రయత్నాల్లో వున్నారు. మాంచి ఇంట్రెస్టింగ్ టీజర్ ను కట్ చేస్తున్నారు. దాన్ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా బన్నీ ఫ్యాన్స్ కు అందించబోతున్నారు. మరి ఆ విషయాన్నే ఈరాత్రికి ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అదే సీక్రెట్ అని వినిపిస్తోంది.