బన్నీ సినిమా అమ్మకాలు షురూ

వక్కంతం వంశీ-బన్నీ కాంబినేషన్ లో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ టైటిల్ కు నా ఇల్లు ఇండియా అన్నది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ కు తగ్గట్లే…

వక్కంతం వంశీ-బన్నీ కాంబినేషన్ లో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ టైటిల్ కు నా ఇల్లు ఇండియా అన్నది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ కు తగ్గట్లే వుంటుదట సినిమా. సినిమాలో దాదాపు ఇండియాలోని మూడు వంతుల ప్రాంతాలు అలా అలా కనిపిస్తాయి. ఇప్పుటికి 70శాతం పూర్తయిందీ సినిమా. అమెరికాతో సహా ఇండియాలోని చాలా లోకేషన్లలో షూట్ జరగాల్సివుంది.

ఇదిలా వుంటే ఈ సినిమా అమ్మకాలు షురూ అయ్యాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కర్ణాటక అమ్మేసారు. సీడెడ్ బేరాలు సాగుతున్నాయి. విశాఖ తొమ్మిదికోట్లకు కాస్త దగ్గరలో అమ్మేసారు. అంటే ఆంధ్ర మొత్తం దగ్గర దగ్గర 40కోట్ల రేషియో అనుకోవాలి. అలాగే కర్ణాటక కూడా సుమారు అంతే మొత్తానికి ఓకె చేసేసారు. సీడెడ్ 14కోట్ల రేంజ్ లో బేరం సాగుతోందట.

సినిమాకు 80వరకు ఖర్చవుతోంది. సినిమాకు లోకేషన్లు చాలా ఎక్కువ వుండడం, అమెరికాలో కూడా కాస్త ఎక్కువ షెడ్యూలు వుండడం, స్టార్ కాస్ట్ అన్నీ కలిపి వుండడంతో 80దాకా ఖర్చవుతోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారం నాగబాబుకు రాయల్టీ అందేలా సహనిర్మాతగా ప్లాన్ చేసాడు బన్నీ. 

అలాగే తన వంతు రెమ్యూనిరేషన్ ను పెట్టుబడిగా మార్చి బన్నీవాసును కూడా ఓ పార్టనర్ గా పెట్టారు. కానీ వాస్తవానికి 80కోట్ల పెట్టాల్సింది మాత్రం నిర్మాత లగడపాటినే. రెమ్యూనిరేషన్ తో పాటు అదనంగా లాభాల్లో వాటాను బన్నీకి, అలాగే కొంత భాగాన్ని నాగబాబుకు ఇవ్వాల్సి వుంటుంది అన్నమాట.