బన్నీ – ఈసారి మేనమామకు సాయం

హీరోలు తమకు వున్న డిమాండ్ ను ఆసరాగా తీసుకుని, తమ వాళ్లకు సాయం చేయడం అన్నది మంచిదే అనుకోవాలి. ఎన్టీఆర్ దగ్గర నుంచి అది కొనసాగుతూనే వస్తోంది. తమ బంధువులకు డేట్ లు కేటాయించి…

హీరోలు తమకు వున్న డిమాండ్ ను ఆసరాగా తీసుకుని, తమ వాళ్లకు సాయం చేయడం అన్నది మంచిదే అనుకోవాలి. ఎన్టీఆర్ దగ్గర నుంచి అది కొనసాగుతూనే వస్తోంది. తమ బంధువులకు డేట్ లు కేటాయించి నిర్మాతలుగా మార్చడం అనేది అప్పటి నుంచీ వుంది. అయితే మహేష్ బాబు దీన్ని మరో విధంగా మార్చారు. తన డేట్ లు మాత్రమే అన్నకు, అక్కలకు ఇచ్చి, వాటిని వేరేవారికి బదలాయించి, డేట్ లు ఇచ్చినందుకు రాయల్టీగా ఎంతోకొంత వారికి వచ్చేలా చేసారు. సినిమా మీద 'సమర్పించు' అని పేర్లు పడేలా చూసారు. తరవాత తరువాత మహేష్ బాబు ఇది ఆపేసి, స్వంత బ్యానర్ పెట్టుకున్నారు. అదంతా వేరే సంగతి.

అయితే గత కొంతకాలంగా బన్నీ ఈ సిస్టమ్ ను ఫాలో అవుతూ బంధువులను ఆదుకుంటున్నారు. ఓ సినిమాను వరుసక మామ అయిన డాక్టర్ వెంకటేశ్వరరావు పేరు జోడించారు. ఆ తరువాత నాగబాబు పేరు పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ అమ్మ వైపు మేనమామ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ తో సుకుమార్ డైరక్షన్ లో చేయబోయే సినిమాకు ముత్తంశెట్టి మీడియా అనే బ్యానర్ ను జోడించారు. ఆ బ్యానర్ బన్నీ అమ్మ తరపు వారిది. ఆ విధంగా వారికి ఎంతోకొంత మొత్తం వచ్చేలా చేస్తున్నారు బన్నీ.

తన డేట్ లు వారికి కేటాయించి, వాటిని నిర్మాత తీసుకున్నట్లు చూపించి, దానికి బదులుగా రెండు కోట్లో, మూడు కోట్లో, లేదా లాభాల్లో వాటానోవారికి వచ్చేలా చేయడం అన్నమాట. తను నేరుగా ఇవ్వకపోయినా, అవి కూడా తనే తీసేసుకోకుండా ( ఆ అవకాశం వున్నా) ఇలా చేయడం అంటే కాస్త మెచ్చుకోదగ్గదే.

జగన్ గెలుపు వాళ్లకి నచ్చలేదు..