ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత.. అనాథగా ఏర్పడిన తర్వాత.. చంద్రబాబునాయుడు తొలి ముఖ్యమంత్రిగా చేసిన ద్రోహం.. కేవలం మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మాత్రమేకాదు. రాష్ట్రాన్ని.. ప్రధానంగా రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతాన్ని అప్పనంగా సింగపూర్ కు దోచిపెట్టేయడం కూడా. ఆమేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర సంపదకు చేసిన ద్రోహం తక్కువదేమీ కాదు. అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అనూ ముసుగు కింద.. మొత్తం రాజధానిని సింగపూర్ కన్సార్టియంకు దోచిపెట్టేయడానికి.. చంద్రబాబు అగ్రిమెంట్లు చేసేశారు. అలాంటి జాతిద్రోహాలన్నింటినీ చక్కదిద్దడానికి ఇప్పుడు జగన్ పూనుకుంటున్నారు.
స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కు సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పరస్పర అంగీకారంతో ఈ ఒప్పందం రద్దు చేసుకోడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రద్దు చేసుకుంటే.. చంద్రబాబు చేసుకున్న ఒప్పందంలోని అంశాల వలన.. సింగపూర్ కన్సార్టియంకు ప్రభుత్వం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం మీద కొన్ని వందల కోట్ల భారంపడే అవకాశం ఉంది. జగన్ సర్కారు అందుకు కూడా సిద్ధపడుతోంది గానీ.. ఒప్పందాన్ని మాత్రం కొనసాగించే ఉద్దేశంతో లేదు.
ఈ నిర్ణయం వలన నష్టం తప్పదు. కానీ.. రాజధాని ప్రాంతం అనేది సింగపూర్ కన్సార్టియం పాదాల వద్ద దాసోహం అని పడిఉండేలా చంద్రబాబు కల్పించిన దుస్థితికి విముక్తి లభిస్తుంది. అందుకే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దాదాపు 1700 ఎకరాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా రాజధాని మనది, నేల మనది అయినప్పటికీ 58 శాతం వాటా సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టారు. ఎలాంటి కాంట్రాక్టులు కుదిరినా కూడా.. ప్రభుత్వం దానిని ఎప్పుడైనా కారణాలు చెప్పకుండా ఉపసంహరించుకోవచ్చుననే ఒక క్లాజు ఉంటుంది.
ఈ ఒప్పందంలో అలాంటి అవకాశమే లేకుండా.. ప్రభుత్వం తనంతగా ఒప్పందం నుంచి తప్పుకోవడానికి వీల్లేదని.. అలా జరిగితే.. లండన్ కోర్టులో దావా వేసేలా కన్సార్టియంకు అధికారం కట్టబెడుతూ ఒప్పందం చేసుకునారు. సింగపూర్ చాలెంజ్ పద్ధతే ఒక దోపిడీ కాగా, అందులోనూ ఇలాంటి అసహ్యకరమైన నిబంధనలతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు.
ఇప్పుడు ఆ కన్సార్టియం వారితో జగన్ ప్రభుత్వం చర్చించి.. పరస్పర అంగీకరాంతో ఒప్పందం రద్దుచేసుకోడానికి నిర్ణయించింది. పెట్టిన ఖర్చులు ఇచ్చేయాలని వారు భారీ మొత్తం కోరవచ్చు. కానీ.. అమరావతి ప్రాంతానికి మాత్రం చంద్రబాబు విధించిన దాస్యశృంఖలాల నుంచి విముక్తి లభిస్తుంది.