మొన్నటివరకు చేతిలో ఒక్క సినిమా లేదు. ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఓకే చెప్పలేకపోయాడు. అలా అటుఇటుగా ఏడాది ఖాళీగా ఉన్న బన్నీ చేతిలో ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు బన్నీ. అతి త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
త్రివిక్రమ్ మూవీ తర్వాత మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు అల్లుఅర్జున్. సుకుమార్ తో బన్నీకి ఇది మూడో సినిమా. అటు మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై బన్నీకి ఇదే మొదటి సినిమా. త్రివిక్రమ్ మూవీ తర్వాత స్టార్ట్ అయ్యేది కూడా ఇదే.
ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు బన్నీ. దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీకి ఐకాన్ అనే పేరుపెట్టారు. కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్. దిల్ రాజు, బన్నీ కాంబోలో 4వ చిత్రంగా ఇది రాబోతోంది.
లైనప్ అయితే బాగానే ఉంది కానీ వీటిలో ఎన్నిసెట్స్ పైకి వస్తాయనేది అప్పుడే చెప్పలేం. ఎందుకంటే గతంలో ఓ సందర్భంలో ఇలానే వరుసగా సినిమాలు ప్రకటించాడు బన్నీ. కానీ విక్రమ్ కుమార్, లింగుస్వామి దర్శకత్వంలో చేయాల్సిన 2 సినిమాలు ఆగిపోయాయి. సో.. ప్రస్తుతానికైతే బన్నీ చేతిలో 3 సినిమాలున్నాయి. వీటిలో సెట్స్ పైకి ఎన్ని వస్తాయో చూడాలి.