బన్నీ హీరోయిన్-చరణ్ అయిటమ్

చేతిలో రెండు మూడు సినిమాలతో కాస్త బిజీగానే వుంది హీరోయిన్ పూజా హెగ్డే. థాంక్స్ టు బన్నీ దువ్వాడ జగన్నాధమ్. అయితే ఆ సినిమా తరువాత పెద్ద హీరోల సరసన చాన్స్ లు మాత్రం…

చేతిలో రెండు మూడు సినిమాలతో కాస్త బిజీగానే వుంది హీరోయిన్ పూజా హెగ్డే. థాంక్స్ టు బన్నీ దువ్వాడ జగన్నాధమ్. అయితే ఆ సినిమా తరువాత పెద్ద హీరోల సరసన చాన్స్ లు మాత్రం లగెత్తుకువచ్చేయలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తోంది. నాగ చైతన్య సినిమా కోసం అడుగుతున్నారు కానీ, డేట్ లు సెట్ కావడంలేదు. దాంతో వాళ్లు వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు.

ఇదిలా వుంటే ఇప్పుడు సుకుమార్ –చరణ్ సినిమాలో అయిటమ్ గళ్ అయిపోయింది పూజ. సుకుమార్ అంటే ఐటమ్ సాంగ్ లకు పెట్టింది పేరు. నాటు గెటప్ తో, నాటు పదాలతో పాటలు తయారుచేయించి, అయిటమ్ సాంగ్ ల స్పెషలిస్ట్ అనిపించుకున్నారు.

అందుకే ఆయన సినిమాలో అయిటమ్ సాంగ్ లు అంటే కాస్త క్రేజ్ నే. సుకుమార్ లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985లో ఓ అయిటమ్ సాంగ్ పెట్టారు. ఆ పాటకు పూజ హెగ్డేను తీసుకున్నారట. అసలే 1985 నాటి కథాకాలం. అప్పటి అయిటమ్ సాంగ్ అంటే, ఎలా వుంటుందో, సుక్కూ ఎలా చూపిస్తారో? చూడాలి.