మరోసారి తెరపైకి అజ్ఞాతవాసి

ఈ టైటిల్ ఇప్పటిది కాదు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వచ్చిన కొత్తలోనే ఈ పేరు తెరపైకొచ్చింది. అయితే ఆ తర్వాత మరిన్ని పేర్లు కూడా వినిపించాయి. గోకుల కృష్ణుడు, ఇంజినీర్…

ఈ టైటిల్ ఇప్పటిది కాదు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వచ్చిన కొత్తలోనే ఈ పేరు తెరపైకొచ్చింది. అయితే ఆ తర్వాత మరిన్ని పేర్లు కూడా వినిపించాయి. గోకుల కృష్ణుడు, ఇంజినీర్ బాబు, దేవుడే దిగి వస్తే, మాధవుడు, పరదేశ ప్రయాణం.. ఇలా చాలా పేర్లు చర్చకొచ్చాయి. అయితే ఈ చర్చ అటుఇటు తిరిగి ఆశ్చర్యకరంగా మళ్లీ అజ్ఞాతవాసి అనే టైటిల్ వద్దకే వచ్చి ఆగింది.

మొన్న దసరాకు పవన్ కొత్త సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ దసరా పోయింది.. ఇప్పుడు దీపావళి అంటున్నారు. ఆ టైమ్ కు కూడా టైటిల్ ఎనౌన్స్ చేస్తారో చేయరో అనే సందేహం అందర్లో ఉంది. మరోవైపు సినిమా యూనిట్ నుంచి మాత్రం టైటిల్ పై లీకులు వస్తూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫిక్స్ చేస్తారని టాక్.

నిజానికి అజ్ఞాతవాసి అనే టైటిల్ పై మిక్స్ డ్ రెస్పాన్స్ ఉంది. కొందరు బాగుందన్నారు. చాలామంది బాగాలేదన్నారు. యూనిట్ మాత్రం టైటిల్ ఎనౌన్స్ చేసిన తర్వాత క్లిక్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది. ఎందుకంటే గతంలో అత్తారింటికి దారేది టైటిల్ విషయంలో కూడా ఇలానే డివైడ్ టాక్ వచ్చింది. కానీ టైటిల్ క్లిక్ అయింది.