సౌత్ అంతా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సుచి లీక్స్ లో ఇప్పుడు బన్నీ పేరు బయటపడింది. సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి సెలబ్రిటీల రాసలీలలు అంటూ ప్రముఖుల హాట్ ఫోటోలు, వీడియోలు రోజుకొకటి చొప్పున బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రానా-త్రిష, ధనుష్-త్రిష, అనిరుధ్-ఆండ్రియాలకు చెందిన ముద్దుసీన్లు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడీ లీక్స్ జాబితాలోకి అల్లుఅర్జున్ పేరు కూడా చేరింది.
నిజానికి అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చిందే తప్ప, అతడికి సంబంధించి న్యూస్ మాత్రం రాంగ్ న్యూస్ కాదు. దర్శకుడు సెల్వరాఘవన్, హీరోయిన్ ఆండ్రియాకు రాసినట్టుగా ఓ ఈ-మెయిల్ సుచి లీక్స్ నుంచి బయటకొచ్చింది. ఆ ఈమెయిల్ లో సినిమా విషయాలతో పాటు, కొన్ని వ్యక్తిగత అంశాల్ని సెల్వరాఘవన్ ప్రస్తావించినట్టు ఉంది. అందులోనే బన్నీ గురించి ఆండ్రియాకు సెల్వరాఘవన్ చెప్పినట్టు రాసుంది. ఓ నవల ఆధారంగా బన్నీ కోసం ఓ స్టోరీ రాస్తున్నానని, వాల్ట్ డిస్నీ సంస్థ ఆ సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉందని సెల్వ రాసినట్టు అందులో ఉంది.
ఈ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని ప్రస్తావించినట్టు అందులో ఉంది. నిన్ను నేను కోరుకున్న మాట వాస్తవమే కానీ, దానికోసం ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా అంటూ సెల్వరాఘవన్, ఆండ్రియాకు రాసినట్టు ఉంది. మొత్తమ్మీద ఈ వ్యవహారంతో బన్నీ చేయాల్సిన ఓ బడా ప్రాజెక్టు వివరాలు బయటకు వచ్చాయి. అయితే బన్నీ కోసం సెల్వరాఘవన్ తయారుచేసిన ఆ స్టోరీ ఏమైనట్టు..? అసలు ఈ-మెయిన్ ఎప్పటిది…? అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.