రేఖా, సంజయ్ దత్ లు పెళ్లి చేసుకున్నారా?

వాళ్లిద్దరూ మీడియా ముందు అగుపిస్తున్న వాళ్లే… వాళ్ల గురించి అనునిత్యం మీడియాలో అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి… అయితే ఎందుకు ప్రస్తావనకు వచ్చిందో, ఎందుకు పాత వ్యవహారాలను పీకి పాకం పెడుతున్నారో కానీ.. బాలీవుడ్…

వాళ్లిద్దరూ మీడియా ముందు అగుపిస్తున్న వాళ్లే… వాళ్ల గురించి అనునిత్యం మీడియాలో అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి… అయితే ఎందుకు ప్రస్తావనకు వచ్చిందో, ఎందుకు పాత వ్యవహారాలను పీకి పాకం పెడుతున్నారో కానీ.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, బాలీవుడ్ ఒకనాటి క్వీన్ రేఖకు పెళ్లైంది.. ఇప్పడు కాదు దశాబ్దాల కిందటే అది జరిగింది, దత్ ను రేఖ భర్తగానే భావిస్తుంది.. అనే రూమర్ హిందీ మీడియాలో నిన్నంతా షికారు చేసింది.

ప్రస్తుతం దత్ తన భార్య మాన్యతతో కలిసే ఉంటున్నాడు. ఈ దంపతులకు ట్విన్స్ కూడా ఉన్నారు. అంతకు ముందుకూడా దత్ కు వేరే వైవాహిక జీవితం ఉండేది. ఇక రేఖ విషయానికి వస్తే.. ఆమె వైవాహిక చరిత్ర కూడా చాలా పెద్దగానే ఉంది. మరి ఉన్న ఫలంగా వీరిద్దరికీ పెళ్లైందని…  హడావుడి ఏమిటి? అంటే… ఏదో పాత వ్యవహారాన్ని గుర్తుచేసి, వీళ్లిద్దరికీ అప్పట్లోనే పెళ్లి అయ్యిందని మీడియా గోల చేసింది.

ఇప్పుడు కాదట.. ఎప్పుడో 1984 సంవత్సరంలోనే దత్- రేఖలకు వివాహం అయ్యిందని అనేది ఈ రూమర్ సారాంశం. అయితే ఈ విషయాన్ని ఖండించాడు రేఖ బయోగ్రఫీ రైటర్. వారికి పెళ్లైందనే విషయం పూర్తిగా అబద్ధమని ఆయన వివరణ ఇచ్చాడు. 

దత్ డ్రగ్స్ మత్తు నుంచి రికవర్ అవుతున్న దశలో రేఖ అతడికి అండగా నిలిచిందని, అతడు కోలుకోవడానికి కృషి చేసిందని… అలాంటి వారి సాన్నిహిత్యంపై ‘ప్రేమ’ అనే రూమర్ మొదలైందని ఆయన అన్నారు. కొన్నాళ్ల పాటు ఆ ప్రచారం జరిగిందని, చివరకు అదే ఆగిపోయిందని… చాలా మంది హీరోలతో కూడా రేఖకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగిందని, అలాంటి వాటిలో దత్ పేరు కూడా ఒకటని అన్నారు. వాళ్లిద్దరికీ పెళ్లి కాలేదని నొక్కి వక్కాణించాడు.