బన్నీకి అన్ని విధాల మైనస్సేనా?

మళ్లీ వ్యవహారం మొదటికి రాకపోతే అన్న కండిషన్ ప్రకారం చూసుకుంటే భరత్ అనే నేను, నా పేరు సూర్య విడుదల వ్యవహారంలో నెలకొన్న వివాదం ముగిసినట్లే. కానీ ఈ వివాదంలో ఎవరు లాభపడినట్లు? మహేష్…

మళ్లీ వ్యవహారం మొదటికి రాకపోతే అన్న కండిషన్ ప్రకారం చూసుకుంటే భరత్ అనే నేను, నా పేరు సూర్య విడుదల వ్యవహారంలో నెలకొన్న వివాదం ముగిసినట్లే. కానీ ఈ వివాదంలో ఎవరు లాభపడినట్లు? మహేష్ సినిమానా? బన్నీ సినిమానా? ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నది మాత్రం మహేష్ సినిమాకే లాభం జరిగింది అన్నది.

అసలు ఈ వివాదంలో కాస్త టెన్షన్ పడింది బన్నీ యూనిట్ నే. పెద్దలను కదిలేలా చేసి, హాడావుడి చేసి, చెరోడేట్ కు వెళ్లేలా నిర్ణయం వెలువడేలా చూసారు. దీనికి కారణం రెండు సినిమాలు పోటీ పడితే తమ సినిమాకు నష్టం వాటిల్లుతుందన్నది బన్నీ యూనిట్ కు టెన్షన్ గా మారింది.

పరిష్కారం కూడా బన్నీ యూనిట్ కు తెలుసు. మే నెలలోకి మహేష్ వెళ్లమన్నా వెళ్లడు. అందువల్ల తామే వెళ్లాలి. అలా అని మహేష్ కు ఆ డేట్ వదలేస్తే, వెనక్కు తగ్గామన్న సమస్య. అందుకే మహేష్ ను ముందుకు జరగమని, తాము వెనక్కు వెళ్లి, కాలాకు డేట్ వదిలేసారు. తమిళ డబ్బింగ్ సినిమాకు డేట్ ఇచ్చేసి, బుద్దిగా మన సినిమాలు రెండూ చెరో డేట్ చూసుకున్నాయన్నమాట. సరే అది వేరే సంగతి.

మహేష్ సినిమా ముందుగా రావడం వల్ల థియేటర్ల సమస్య వుండదు.
మార్కెట్ లో సరైన సినిమా లేని టైమ్ లో వచ్చి మాంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది.
బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బులు కట్టడం దగ్గర సమస్య రానే రాదు. 
వారం రోజుల పాటు సోలోగా థియేటర్లలో వుంటుంది.

ఇక బన్నీ సినిమా విషయానికి వస్తే..
మహేష్ సినిమా హిట్ అయితేనే, బయ్యర్లు, ఎగ్జిబిటర్ల దగ్గర డబ్బులు టర్నోవర్ అవుతాయి. బన్నీ సినిమాకు పేమెంట్లు సరిగ్గా వస్తాయి. లేదంటే సమస్యే.

మహేష్ సినిమా హిట్ అయితే, మూడు వారాలు కనీసం థియేటర్లలో వుంటుంది. 
అందువల్ల బన్నీ సినిమా డేట్ కు థియేటర్లు అన్నీ ఖాళీ అయిపోతాయని అనుకోవడానికి లేదు.

బన్నీ సినిమా విడుదల టైమ్ కు థియేటర్లలో ఇటు మహేష్ సినిమా, అటు రజనీ సినిమా వుంటాయి. అందువల్ల సోలో అన్న సదుపాయమే వుండదు.

కాలా సినిమా అటు ఇటుగా వున్నా, బాగా వున్నా, వన్ వీక్ లో థియేటర్లలోంచి తీసేయడం చేయరు. అందువల్ల ఇటు మహేష్ సినిమా, అటు రజనీ సినిమా పోగా మిగిలిన థియేటర్లే బన్నీ సినిమాకు మిగులుతాయి.

ఇక్కడ 'కాల'తంత్రం కూడా తక్కువేమీ కాదు. ఈ సినిమాకు సీనియర్ నిర్మాత ఎన్వీప్రసాద్ బ్యాకింగ్ గా వున్నారు. ఆయనకు ఇటు మహేష్ తోనూ, అటు అరవింద్ తోనూ అన్ని విధాలా సత్సంబంధాలు వున్నాయి. అందువల్ల కాలా సినిమా విడుదల కూడా స్మూత్ గా సాగిపోవాలి.

ఇక్కడ సమస్య కోసం తమిళ నాట డేట్ అయితే మార్చుకోరు. అందుకే అందరూ కలిసి చక్రం తిప్పారు. తెలుగు సినిమాలను తెలివిగా అటు ఇటు నెట్టి, కాలాకు రూట్ వదిలారు. కానీ అటు ఇటు రెండు పెద్ద సినిమాల మధ్యలో పడి, 'కాలా' ఏమవుతుందో చూడాలి.

ఏమయినా ఈ పోటీలో వెలువడిన నిర్ణయం బన్నీ సినిమాకు ప్లస్ అయితే కాదు అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.