గబ్బర్ సింగ్ తరవాత హరీష్ శంకర్ ఇంటి ముందు కార్లు బార్లు తీరాయి. నిర్మాతలు అడ్వాన్సులు పెట్టారు. హీరోలు కథలు విన్నారు. రామయ్యా వస్తావయ్యా తరవాత మాత్రం ఇవన్నీ రివర్స్ అయ్యాయి. కొంతమంది అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయమన్నారట. హీరోలు హరీష్‌ని లైట్ తీసుకొంటున్నారు.
ఈ కోవలో అల్లుఅర్జున్‌తో సినిమా కూడా పక్కకు వెళ్లిపోయిందని చెప్పుకొన్నారు. అయితే ఆ సినిమా ఉందట. బన్నీ ప్రస్తుతం రేసుగుర్రం సినిమాతో బిజీగా ఉన్నాడు, ఆ తరవాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా హరీష్‌కి అవకాశం ఇస్తున్నాడని టాక్. త్రివిక్రమ్, హరీష్‌ల సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
ప్రస్తుతం హరీష్ ఈ స్ర్కిప్టుకి తుదిరూపం ఇస్తున్నాడట. మార్చి నెలలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయని సమాచారమ్. అందరూ హరీష్‌కి హ్యాండిచ్చినా… బన్నీ మాత్రం ఇవ్వలేదన్నమాట!