స‌మంత పాట ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

స‌మంత తొలిసారి పాట పాడుతోంది. అదీ…. త‌న‌ది కాని సినిమా కోసం. మరి పారితోషికం ఎంతిచ్చుంటారు..??  స‌మంత‌లాంటి క‌థానాయిక పాడుతోందంటే ఎంత ఇవ్వడానికైనా రెడీనే. కానీ స‌మంత  ఈ సినిమాకి ఫ్రీగా పాడ‌బోతోంది. అంటే…

స‌మంత తొలిసారి పాట పాడుతోంది. అదీ…. త‌న‌ది కాని సినిమా కోసం. మరి పారితోషికం ఎంతిచ్చుంటారు..??  స‌మంత‌లాంటి క‌థానాయిక పాడుతోందంటే ఎంత ఇవ్వడానికైనా రెడీనే. కానీ స‌మంత  ఈ సినిమాకి ఫ్రీగా పాడ‌బోతోంది. అంటే డ‌బ్బులు తీసుకోవ‌డం లేదు అని కాదు… తీసుకొన్నా అవి త‌న కోసం కాదు. స‌మంత‌ది జాలి గుండె అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

దిల్‌షుఖ్ న‌గ‌ర్ బాంబు పేలుడు బాధితుల‌కు త‌న‌వంతు స‌హాయం అందించింది. ఓ ఫౌండేష‌న్‌కు ఆర్థికంగా అండ‌గా నిలుస్తోంది. ఆ సంస్థ కోసమే ఇప్పుడు ఈ పాట పాడుతోంద‌ట‌. ఈ పాట ద్వారా వ‌చ్చిన పారితోషికాన్ని సేవా కార్యక్రమాల‌కు ఖ‌ర్చు చేయాల‌ని భావిస్తోంది. ఎంతైనా.. స‌మంత గ్రేట్ క‌దూ.!